ఈ ఏడాది ‘బేబి’ చిత్రంతో కెరీర్‌లో బిగ్ సక్సెస్‌ను అందుకున్న విరాజ్ అశ్విన్.. ‘జోరుగా హుషారుగా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. పూజిత పొన్నాడ హీరోయిన్. అను ప్రసాద్ దర్శకుడు. నిరీష్ తిరువిధుల నిర్మించారు.
ఈనెల 15న సినిమా విడుదలవుతున్న సందర్భంగా విరాజ్ మాట్లాడుతూ ‘ఇందులో చేనేత కుటుంబానికి చెందిన మిడిల్ క్లాస్ యువకుడిగా కనిపిస్తా. కష్టాలను మనసులో దాచుకుని, పైకి సంతోషంగా కనిపించే పాత్ర. పర్సనల్‌గా నాకు చాలా కనెక్ట్ అయింది. ముఖ్యంగా ఇందులోని ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ అందర్ని కట్టిపడేస్తుంది.
ఒక మధ్యతరగతి తండ్రి తన కొడుకు సక్సెస్ కావడానికి ఎలాంటి త్యాగాలు చేశాడు.. ఆ కుటుంబం కోసం కొడుకు ఏం చేశాడు అనేది ఎంతో ఎమోషనల్‌గా ఉంటుంది. మరోవైపు నా పాత్రలో ఎంటర్‌టైన్మెంట్ కూడా ఉంటుంది. అందరూ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తారనే నమ్మకం ఉంది. ఇక ‘బేబి’ తర్వాత చాలా ఆఫర్స్ వస్తున్నాయి. నేను సెలెక్టివ్‌గా ముందుకెళ్తున్నాను’ అని చెప్పాడు.
