పెద్దపులిపై తిరగబడ్డ ఎలుగుబంటి.. తోక ముడుచుకొని పెద్దపులి పరార్

పెద్దపులిపై తిరగబడ్డ ఎలుగుబంటి.. తోక ముడుచుకొని పెద్దపులి పరార్

పెద్దపులి వేటాడితే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నేషనల్ జియోగ్రఫీ వంటి ఛానల్స్ లో అందరూ చూసే ఉంటారు... పెద్దపులి టార్గెట్ పెట్టిందంటే మిస్ అయ్యే ప్రసక్తే ఉండదు. లేడి పిల్ల నుంచి మదగజం దాకా పులి పంజా నుంచి తప్పించుకోవడం అసాధ్యం.. అలాంటి పెద్దపులి ఒక ఎలుగుబంటి బయపడిందంటే నమ్ముతారా.. నమ్మడం కష్టమే. కానీ.. ఈ వీడియో చుస్తే కచ్చితంగా నమ్ముతారు. పెద్దపులిపై ఎలుగుబంటి తిరగబడింది.. ఎలుగుబంటి దాటికి తోక ముడుచుకొని పెద్దపులి పరారయ్యింది.

నల్లమల అడవిలో చోటు చేసుకుంది ఈ ఘటన. బుధవారం ( మే 21 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. నల్లమల అడవిలో ఓ ఎలుగుబంటి పిల్లపై దాడికి దిగింది పెద్దపులి.. ఇది గమనించిన తల్లి ఎలుగుబంటి పెద్దపులిపై తిరగబడింది. తన బిడ్డను కాపాడుకోవాలనే తాపత్రయంతో పెద్దపులిపై వీరోచితంగా తిరగబడింది ఎలుగుబంటి. కాసేపు ఏలుగుబంటిపై తిరగబడేందుకు ప్రయత్నించినప్పటికీ.. ఫలితం లేక తోకముడుచుకొని అక్కడి నుంచి పరారయ్యింది పెద్దపులి.

 

పేగు బంధం ముందు ఎంతటి పెద్దపులి అయినా జుజుబీ అని ఈ ఘటనతో ప్రూవ్ అయ్యింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.. తల్లి ప్రేమను మించిన బలం ఈ సృష్టిలోనే లేదంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్స్.