ఎస్ఐకి బుల్లెట్ ఎట్ల లోడ్ చేయాలో తెల్వదు

ఎస్ఐకి బుల్లెట్ ఎట్ల లోడ్ చేయాలో తెల్వదు

‘‘గన్లోకి బుల్లెట్స్ ను ఎలా లోడ్ చేయాలి..’’  అనేది పోలీసులకు తప్పకుండా తెలిసి ఉండాల్సిన విషయం!! కానీ ఉత్తరప్రదేశ్ కు చెందిన ఒక సబ్ ఇన్ స్పెక్టర్ అతడి ఉన్నతాధికారులను షాక్ కు గురి చేశాడు.అతడు బుల్లెట్లను ఏకంగా తుపాకీ గొట్టంలో నుంచి లోడ్ చేసే ప్రయత్నం చేయడాన్ని చూసి చుట్టూ ఉన్న సహ సిబ్బంది షాక్ కు గురయ్యారు. ఫిరంగి గొట్టంలోకి మందుగుండు చొప్పించినట్టుగా.. తుపాకీ గొట్టంలోకి బుల్లెట్లను సబ్ ఇన్ స్పెక్టర్ వేయడాన్ని చూసి అక్కడున్న సహోద్యోగులు సైలెంట్ గా నవ్వుకున్నారు.

ఆ సబ్ ఇన్ స్పెక్టర్ అంతటితో ఊరుకోలేదు.. ‘‘తుపాకీలోకి బుల్లెట్లు వేసే పద్ధతి ఇదే.. తుపాకీతో ఫైరింగ్ చేసే పద్ధతి ఇదే.. తద్వారా ఎవరికీ గాయాలు కావు’’ అని తన ఉన్నతాధికారికి బదులిచ్చాడు. దీంతో ఆ ఉన్నతాధికారి స్పందించి.. ‘‘నాకు ప్రాక్టికల్ గా చూపించాల్సిన అవసరం లేదు’’ అన్నారు. ‘‘తుపాకీలోకి గొట్టం నుంచి బుల్లెట్స్ వేశావు కదా. మరి ఎలా అన్ లోడ్ చేస్తావు?’’ అని ఉన్నతాధికారి ప్రశ్నించాడు. దీంతో ఆ సబ్ ఇన్ స్పెక్టర్ వెంటనే తుపాకీ గొట్టాన్ని కిందికి వంచి..  తన చేతిలోపడిన బుల్లెట్లను చూపించాడు. 

యూపీ డీఐజీ ఆర్.కె.భరద్వాజ్ సంత్ కబీర్ నగర్ లోని పోలీసు స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఠాణాలోని పోలీసుల నైపుణ్యాలను ఆయన పరీక్షించారు. ఈక్రమంలోనే సదరు సబ్ ఇన్ స్పెక్టర్ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారి.. నవ్వులు పూయిస్తోంది.