IND vs SA: కోహ్లీని అందుకే కింగ్ అంటారేమో..ఎల్గర్ వికెట్ తర్వాత ఏం చేశాడంటే..?

IND vs SA: కోహ్లీని అందుకే కింగ్ అంటారేమో..ఎల్గర్ వికెట్ తర్వాత ఏం చేశాడంటే..?

క్రికెట్ ఫీల్డ్ లో ఎప్పుడు ఏం చేయాలో కోహ్లీకి తెలిసినంత మరెవరికీ తెలియదేమో. ప్రత్యర్థి రెచ్చగొడితే మాటలతో పాటు బ్యాట్ తో సమాధానం చెప్పే కోహ్లీ.. అప్పుడప్పుడూ తనదైన శైలిలో వినోదం పంచుతూ కనిపిస్తాడు. దీనితో పాటు మైదానంలో తన గొప్ప మనసు చాటుకుంటూ కనిపిస్తాడు. తాజాగా దక్షిణాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్ విషయంలో కోహ్లీ చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. 

భారత్, దక్షిణాఫ్రికా మధ్య కేప్ టౌన్ వేదికగా జరుగుతున్న టెస్ట్ ఎల్గర్ కెరీర్ లో చివరిది. ఈ మ్యాచ్ తర్వాత ఈ మాజీ దక్షిణాఫ్రికా కెప్టెన్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడు. ఈ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో 4 పరుగులు చేసిన ఈ స్టార్ ఓపెనర్.. రెండో ఇన్నింగ్స్ లో 12 పరుగులు చేసి ఔటయ్యాడు. ముఖేష్ కుమార్ వేసిన 11 ఓవర్ తొలి బంతికి ఎల్గర్ స్లిప్ లో దొరికిపోయాడు. ఫస్ట్ స్లిప్ లో ఈ క్యాచ్ అందుకున్న కోహ్లీ.. తన చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడుతున్న ఎల్గర్ ను గౌరవించాడు. 

ఎల్గర్ డగౌట్ కు తిరిగి వెళుతున్నప్పుడు అత్యుత్తమ వీడ్కోలు లభించాలని చేతులు రెండు వంచి నమస్కరించాలని అతను ప్రేక్షకులను కోరాడు. క్యాచ్ పట్టిన తర్వాత సెలబ్రేషన్ చేసుకొని కోహ్లీ.. అందరి మనసులను గెలుచుకున్నాడు.టెస్ట్ స్పెషలిస్ట్ గా జట్టులో స్థానాన్ని స్థిరం చేసుకున్న ఈ 36 ఏళ్ళ బ్యాటర్.. దక్షిణాఫ్రికా తరఫున 84 టెస్టుల్లో 37.28 సగటుతో 5146 పరుగులు చేశాడు. 13 సెంచరీలు, 23 హాఫ్ సెంచరీలు ఎల్గర్ ఖాతాలో ఉన్నాయి. ఇక 8 వన్డేలు మాత్రమే ఆడిన ఈ స్టార్ ఓపెనర్ కేవలం 104 పరుగులు మాత్రమే చేసి జట్టులో స్థానం కోల్పోయాడు.