IND vs NZ: నీ తర్వాతే నేను.. సెంచరీ అనంతరం సచిన్ ముందు శిరస్సు వంచిన కోహ్లీ

IND vs NZ: నీ తర్వాతే నేను.. సెంచరీ అనంతరం సచిన్ ముందు శిరస్సు  వంచిన కోహ్లీ

విరాట్ కోహ్లీ.. ఈ ఒక్క పేరుకు ఉన్న క్రేజ్ ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇండియన్ క్రికెట్ లోనే కాదు, ప్రపంచ క్రికెట్ లో తనదైన ముద్ర  వేసాడు. ప్రస్తుత తరంలో కోహ్లీకి మించిన గ్రేట్ బ్యాటర్ లేరనే చెప్పాలి. 15 సంవత్సరాలుగా క్రికెట్ లో కొనసాగుతున్న విరాట్.. ఇప్పటికీ పరుగుల వరద పారిస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలో ఈనో రికార్డులు అంతకు మించిన రివార్డులు కోహ్లీ సొంతం. ఈ క్రమంలో దిగ్గజ బ్యాటర్ క్రికెట్ గాడ్ సచిన్ ఆల్ టైం రికార్డ్ బ్రేక్ చేసాడు. 

ప్రస్తుతం భారత్, న్యూజిలాండ్ తో సెమీ ఫైనల్ ఆడుతుంది. ముంబైగా వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో కోహ్లీ సెంచరీతో చెలరేగాడు. 113 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సులతో 117 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ సెంచరీతో కోహ్లీ తన వన్డే కెరీర్ లో 50 సెంచరీలు పూర్తి చేసుకొని వన్డే చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా క్రికెట్ గాడ్ సచిన్ రికార్డ్ బ్రేక్ చేసాడు. అయితే ఈ సెంచరీ చేసిన తర్వాత కోహ్లీ చేసిన ఒక పని ఆకట్టుకుంటుంది. 

42 ఓవర్ నాలుగో బంతికి రెండు పరుగులు పూర్తి చేసుకున్న కోహ్లీ సెంచరీ అనంతరం తన ఐడల్ సచిన్ ను గుర్తు చేసుకున్నాడు. స్టేడియం అంతా కోహ్లీకి ష్టాండింగ్ ఒవేషన్ ఇవ్వగా.. విరాట్ మాత్రం సచిన్ వైపుగా చూస్తూ బొడౌన్ చేస్తూ కనిపించాడు. ఎన్ని రికార్డులు బ్రేక్ చేసినా నీ తర్వాతే నేను అంటూ సచిన్ వైపుగా చూస్తూ కోహ్లీ చేసిన రియాక్షన్ హైలెట్ గా నిలిచింది. ఆటలోనే కాదు ఒక గొప్ప వ్యక్తిగా కోహ్లీ ఎక్కడికో వెళ్ళిపోయాడు. 

ఇక ఈ మ్యాచ్ లో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 397 పరుగులు చేశారు. కోహ్లీ 117 పరుగులు, అయ్యర్ 105 పరుగులు చేసి సెంచరీల మోత మోగించారు. ఓపెనర్ గిల్ 80 పరుగులు చేయడంతో పాటు మరో ఓపెనర్ రోహిత్ 47 పరుగులు చేసి రాణించారు. చివర్లో రాహుల్ 20 బంతుల్లోనే 39 పరుగులు చేసాడు. న్యూజిలాండ్ బౌలర్లలో సౌథీ 3, బౌల్ట్ ఒక వికెట్ తీసుకున్నారు.