టీ20 ర్యాంకింగ్స్లో టాప్ 10లోకి కోహ్లీ

టీ20 ర్యాంకింగ్స్లో  టాప్ 10లోకి కోహ్లీ

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో కింగ్ కోహ్లీ దుమ్మురేపాడు. పాక్పై ఆడిన ఇన్నింగ్స్...కోహ్లీని ఏకంగా టాప్ 10లోకి దూసుకెళ్లేలా చేసింది.  ఆసియాకప్ సమయంలో 35 వ స్థానంలో ఉన్న కోహ్లీ..టీ20 వరల్డ్ కప్ ఫస్ట్ మ్యాచ్తో  టాప్ -10లోకి చేరుకున్నాడు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్లో కోహ్లీ 9వ స్థానంలో నిలవడం విశేషం. 

సూర్య@3

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో పాక్ ప్లేయర్ రిజ్వాన్ టాప్ వన్లో కొనసాగుతున్నాడు. అతను 849 పాయింట్లతో నెంబర్ వన్లో ఉన్నాడు. ఆ తర్వాత కివీస్ బ్యాట్స్మన్ డివాన్ కాన్వే 831 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. కాన్వే ఆసీస్పై 92 పరుగులు చేయడంతో..టాప్ 2 పొజీషన్లో నిలిచాడు. అయితే తర్వాతి మ్యాచ్లో  కాన్వే మరింత చెలరేగితే మాత్రం నెంబర్ వన్ ర్యాంకును సొంతం చేసుకుకోవచ్చు. అటు టీమిండియా 360 డిగ్రీస్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్..3వ స్థానాన్ని దక్కించుకున్నాడు. సూర్య తర్వాత బాబర్ ఆజమ్, మార్కరమ్, మలన్, ఫించ్, నిస్సంకా తర్వాతి స్థానంలో ఉన్నారు. 

చిరస్మరణీయ విజయం..

టీ20 వరల్డ్ కప్లో భాగంగా 23వ తేదీన టీమిండియా పాక్తో మొదటి మ్యాచ్ ఆడింది. ఉత్కంఠగా సాగిన మ్యాచ్ భారత్ అద్భుత విజయం సాధించింది. 31 పరుగులకే నాలుగు వికెట్లు  కోల్పోయి కష్టాల్లో పడిన సమయంలో...కోహ్లీ...విశ్వరూపం ప్రదర్శించాడు. 53 బంతుల్లో 82 పరుగులతో నాటౌట్గా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు.