వరసగా మూడు రోజులు బ్యాటింగ్.. కోహ్లీ టెస్ట్ మ్యాచ్ అంటూ కామెంట్స్

వరసగా మూడు రోజులు బ్యాటింగ్.. కోహ్లీ టెస్ట్ మ్యాచ్ అంటూ కామెంట్స్

టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ వన్డేల్లో కొత్త సంప్రదాయాన్ని ప్రవేశపెట్టాడు. టెస్టు ఫార్మాట్ ని గుర్తు చేస్తూ ఒక అరుదైన రికార్డ్ తన ఖాతాలో వేసుకున్నాడు. అదేంటి విరాట్ కోహ్లీ 84 బంతుల్లో సెంచరీ బాదితే టెస్టు ఆడడమేంటి అనుకుంటున్నారా..? వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా విరాట్ నిజంగానే టెస్టు ఆడాడు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. 
 
వరుసగా మూడు రోజులు బ్యాటింగ్

ఎక్కడైనా వరుసగా మూడు రోజులు వన్డేల్లో బ్యాటింగ్ కొనసాగిస్తారా..?అది అసలు సాధ్యం కానీ పని. కానీ విరాట్ కోహ్లీ ఆ పని చేసి చూపించాడు. ఆసియా కప్ లో సూపర్-4లో భాగంగా పాకిస్థాన్ మీద మ్యాచులో ఆదివారం గిల్ ఔటైన తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన విరాట్ ఆ రోజు 8 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇక ఈ మ్యాచ్ కి రిజర్వ్ డే ఉండడంతో నిన్న(సోమవారం) ఈ మ్యాచ్ ని కొనసాగించారు. 8 పరుగులతో బ్యాటింగ్ కొనసాగించిన కోహ్లీ ఇన్నింగ్స్ చివరివరకు బ్యాటింగ్ చేసి 122 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.
 
తాజాగా.. శ్రీలంకపై ఈ రోజు మ్యాచ్ జరుగుతుండగా కోహ్లీ బ్యాటింగ్ కి దిగాడు. దీంతో తొలి రెండు రోజులు నాటౌట్ గా నిలిచిన కోహ్లీ.. మూడో రోజు కూడా నాటౌట్ తో తన బ్యాటింగ్ ని కొనసాగించడం విశేషం. క్రికెట్ చరిత్రలో ఇలా జరగడం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. కోహ్లీతో పాటు రాహుల్ కూడా ఈ అరుదైన జాబితాలోకి చేరడం గమనార్హం. మొత్తానికి ఊహించని జాబితాలోకి చేరిపోయిన మన బ్యాటర్లకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.