ఐసీసీ ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మంత్గా కోహ్లీ

ఐసీసీ ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మంత్గా కోహ్లీ

దుబాయ్‌‌‌‌‌‌‌‌‌‌: టీ 20 వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌లో సత్తా చాటుతున్న టీమిండియా మాజీ కెప్టెన్‌‌‌‌ విరాట్‌‌‌‌ కోహ్లీ అక్టోబర్‌‌‌‌ నెలకు గాను ఐసీసీ ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మంత్ అవార్డు గెలుచుకున్నాడు. విమెన్స్‌‌‌‌ కేటగిరీలో పాకిస్తాన్‌‌‌‌ వెటరన్‌‌‌‌ ఆల్‌‌‌‌ రౌండర్‌‌‌‌ నిదా దర్‌‌‌‌ ఈ అవార్డుకు ఎంపికైంది. గత నెలలో జరిగిన ఆసియా కప్‌‌‌‌లో సూపర్‌‌‌‌ పెర్ఫామెన్స్‌‌‌‌ చేసిన నిదా.. ఇండియన్స్ జెమీమా రోడ్రిగ్స్‌‌‌‌, దీప్తి శర్మను వెనక్కు నెట్టి ఈ అవార్డు నెగ్గింది. గ్లోబల్‌‌‌‌ ఓటింగ్‌‌‌‌ ద్వారా కోహ్లీ, నిదా విన్నర్లుగా నిలిచారని ఐసీసీ ప్రకటించింది. అక్టోబర్‌‌‌‌లో 205 రన్స్‌‌‌‌ చేయడంతో విరాట్‌‌‌‌ను అవార్డు వరించింది.