IND vs RSA: విరాట్ సరికొత్త చరిత్ర: సచిన్ ఆల్ టైం రికార్డ్‌ను సమం చేసిన కోహ్లీ

IND vs RSA: విరాట్ సరికొత్త చరిత్ర: సచిన్ ఆల్ టైం రికార్డ్‌ను సమం చేసిన కోహ్లీ

విరాట్ కోహ్లీ.. భారత క్రికెట్ లో తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్నాడు. పరుగులు, బౌండరీలు అలవోకగా రాబట్టే కోహ్లీ సెంచరీలు అంతే ఈజీగా కొట్టేస్తాడు. 2008 లో శ్రీలంకపై వన్డేల్లో తన తొలి సెంచరీ చేసిన కోహ్లీ 2023 వరల్డ్ కప్ లో దక్షిణాఫ్రికాపై తన 49 వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 118 బంతుల్లో 10 ఫోర్లతో సెంచరీ పూర్తి చేసిన విరాట్.. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ వన్డేల్లో అత్యధిక సెంచరీల రికార్డ్ ను సమం చేసి సరికొత్త చరిత్ర సృష్టించాడు. 

ప్రతి ఆటగాడికి అంతర్జాతీయ క్రికెట్ లో సెంచరీ కొట్టడం ఒక ఒక కళ. కానీ మంచినీళ్లు తాగినంత సులభంగా కోహ్లీ సెంచరీలు బాదేస్తున్నాడు. తన కెరీర్ లో 300 వన్డేలు కూడా ఆడని కోహ్లీ 49 సెంచరీలు చేయడం క్రికెట్ ప్రపంచాన్ని విస్తు గొలుపుతుంది. సచిన్ సైతం 49 సెంచరీలు చేయడానికి 450 మ్యాచ్ లు తీసుకుంటే విరాట్ మాత్రం 289 మ్యాచులోనే ఈ ఘనతను సాధించాడు. ఈ వరల్డ్ కప్ ముందు వరకు వన్డేల్లో 47 సెంచరీలు పూర్తి చేసుకున్న కోహ్లీ వరల్డ్ కప్ లో బంగ్లాదేశ్ పై తన 48 సెంచరీని కంప్లీట్ చేసుకున్నాడు. అయితే న్యూజీలాండ్ పై 95 పరుగులు, శ్రీలంకపై 88 పరుగులు చేసిన కోహ్లీ.. తన 49 వ సెంచరీని తృటిలో కోల్పోయాడు. 

తనను ఎంతగానో ఊరించిన 49 వ సెంచరీ వరల్డ్ కప్ లో  సౌత్ ఆఫ్రికాపై తాజాగా కొట్టేసాడు. అది కూడా వరల్డ్ కప్ లో తన పుట్టిన రోజున చేయడంతో ఈ సెంచరీ మరింత స్పెషల్ గా మారింది. పుట్టిన రోజు కోహ్లీ సెంచరీపై ఎన్నో ఆశలు పెట్టుకున్న కోహ్లీ.. ఫ్యాన్స్ కు మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చాడు. కోహ్లీ  మరో సెంచరీ సాధిస్తే వన్డేల్లో 50 సెంచరీలు కొట్టిన తొలి ప్లేయర్ గా సరికొత్త చరిత్ర సృష్టిస్తాడు. ఈ వరల్డ్ కప్ లో నెదర్లాండ్స్ పై లీగ్ మ్యాచ్ తో పాటు సెమీ ఫైనల్ కూడా ఆడాల్సి ఉంది. మరి ఈ రెండు మ్యాచుల్లో కోహ్లీ సెంచరీ కొడతాడో  లేదా చూడాలి.

ఈ సెంచరీతో 79 సెంచరీలు పూర్తి చేసుకున్న కోహ్లీ మరో 22 సెంచరీలు చేస్తే అంతర్జాతీయ క్రికెట్ లో సచిన్ ఆల్ టైం రికార్డ్ బ్రేక్ చేస్తాడు. ఇప్పటివరకు 100 సెంచరీలతో సచిన్ టాప్ లో ఉంటే కోహ్లీ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.