Virat Kohli: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టును ఐపీఎల్ 2026 విజేతగా నిలిపి, వరుసగా రెండోసారి టైటిల్ గెలిచిన ఆనందంలో ఉన్న మాజీ భారత కెప్టెన్ విరాట్ కోహ్లి మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాడు. ఇవాళ (2026, జూన్3న) ముంబై ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న కోహ్లీని కవర్ చేయడానికి ఫోటోగ్రాఫర్లు (పాపారాజీలు) ఎగబడ్డారు. క్యాజువల్ వైట్ టీ-షర్ట్‌లో ఎంతో కూల్‌గా కనిపించిన సూపర్‌స్టార్.. కెమెరాలకు నవ్వుతూ ఫోజులు ఇచ్చాడు. అయితే, ఫొటోలు తీసుకున్న తర్వాత కోహ్లి సరదాగా క్యా కర్నా హై అభీ? (ఇప్పుడు ఏం చేయాలి మరి?) అని హిందీలో అనడంతో అక్కడ నవ్వులు విరిశాయి.
ALSO READ : ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌లో భారత్ ఆడకపోయినా..
ఐపీఎల్ విజయం తర్వాత బృందావనంలో కోహ్లీ దంపతులు:
ముంబై ఎయిర్‌పోర్ట్‌కు రావడానికి ఒక రోజు ముందే, విరాట్ కోహ్లి తన భార్య అనుష్క శర్మతో కలిసి ఆధ్యాత్మిక నగరమైన బృందావనాన్ని సందర్శించారు. అక్కడ ప్రముఖ ఆధ్యాత్మిక గురువు ప్రేమానంద్ మహారాజ్ ను కలుసుకుని ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. దాదాపు రెండు గంటల పాటు ఆశ్రమంలో గడిపిన ఈ జంట.. ఆ ప్రైవేట్ సమావేశం ముగించుకుని బయటకు వచ్చేటప్పుడు నుదుట చందనం, త్రిపుండ్రం ధరించి కనిపించారు. ఆశ్రమ నిర్వాహకులు వారికి ఒక ప్రత్యేక పుస్తకాన్ని బహుకరించగా, వారు దానిని భక్తితో స్వీకరించారు. ఆ తర్వాత, కోహ్లి దంపతులు స్వామి హిట్ గోవింద్ శరణ్ ఆశ్రమాన్ని కూడా సందర్శించి వారి బ్లెస్సింగ్స్ తీసుకున్నారు.
The way he said “kya karna hai abhi” 😭😭 pic.twitter.com/1ljdApfc4i
— ` (@wristofkohli) June 3, 2026
