పరుగుల మిషెన్ కోహ్లీ

పరుగుల మిషెన్  కోహ్లీ

అందరికీ అందుబాటులో విరాట్​

మెల్‌‌‌‌బోర్న్: టీ20 వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌లో గ్రౌండ్‌‌‌‌లో ఖతర్నాక్‌‌‌‌ షాట్లతో ఫ్యాన్స్‌‌‌‌ అలరిస్తున్న టీమిండియా కింగ్‌‌‌‌ విరాట్‌‌‌‌ కోహ్లీ.. గ్రౌండ్‌‌‌‌ బయట అందరినీ మెప్పిస్తున్నాడు. గతానికి భిన్నంగా ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటున్నాడు. ఎవ్వరు పిలిచినా పలుకుతున్నాడు. అడిగిన వాళ్లందరికీ  నవ్వుతూ సెల్ఫీలు ఇస్తూ అభిమానుల్లో ఆనందాన్ని నింపుతున్నాడు. ఇతర జట్ల ఆటగాళ్లు, మీడియా పర్సన్స్‌‌‌‌తో పాటు ఫ్యాన్స్‌‌‌‌, సాధారణ ప్రజలకు ఫొటోలు ఇస్తున్నాడు. ఆసీస్‌‌‌‌లో కరోనా రిస్ట్రిక్షన్స్‌‌‌‌ లేకపోవడంతో ప్లేయర్లంతా బయట ఫ్రీగా తిరుగుతున్నారు.

రెస్టారెంట్స్‌‌‌‌, షాపింగ్‌‌‌‌ కాంప్లెక్స్‌‌‌‌లు,  కాఫీ షాప్స్‌‌‌‌కు వెళ్తున్నారు. ఈ క్రమంలో తనను గుర్తుపట్టి దగ్గరికి వచ్చిన వాళ్లను కోహ్లీ నవ్వుతూ రిసీవ్‌‌‌‌ చేసుకుంటున్నాడు. ఓ కాఫీషాప్‌‌‌‌ వద్ద ఉన్న కోహ్లీ దగ్గరకు వెళ్లి సెల్ఫీ అడగ్గానే ఇచ్చాడని కాన్‌‌‌‌బెరాలో ఉంటున్న ఓ ఇండియన్‌‌‌‌ చెప్పాడు. మెల్‌‌‌‌బోర్న్‌‌‌‌లో జూనియర్‌‌‌‌ విమెన్స్‌‌‌‌ క్లబ్‌‌‌‌ హాకీ టీమ్‌‌‌‌ కోరిక మేరకు విరాట్‌‌‌‌ గ్రూప్‌‌‌‌ ఫొటో దిగాడు.  ఇక, శనివారం 34వ బర్త్‌‌‌‌డే కాగా..   ఓ రోజు ముందే సోషల్‌‌‌‌ మీడియా వేదికగా అతనికి విషెస్‌‌‌‌ వెల్లువెత్తాయి. ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్‌‌‌‌ పలు  కార్యక్రమాలు చేస్తున్నారు.