కోహ్లీ కోసం స్టేడియంలోకి దూసుకొచ్చిన బాలుడు

కోహ్లీ కోసం స్టేడియంలోకి దూసుకొచ్చిన బాలుడు

దుబాయ్స్టేడియంలో కోహ్లీని కలిసేందుకు ఓ బాలుడు నిబంధనలు ఉల్లంఘించి దూసుకొచ్చాడు. అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డు అతడ్ని ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నాడు. గమనించిన కోహ్లీ.. ఆ బాలుడ్ని వదిలేయాల్సిందిగా సూచించాడు. సెక్యూరిటీ గార్డు విడిచిపెట్టిన తర్వాత కోహ్లీ దగ్గరకు వెళ్లాడు బాలుడు. కోహ్లీ ఆటో గ్రాఫ్, సెల్ఫీలు ఇవ్వడంతో సంబురపడిపోయాడు బాలుడు. ఈ విజువల్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. కోహ్లీని అప్రిషియేట్ చేస్తున్నారు నెటిజన్లు. అభిమానిని పిలిచి మాట్లాడి.. సెల్ఫీ దిగి పంపించడం గ్రేట్ అని.. అందుకే విరాట్ కింగ్ అంటూ పొగుడుతున్నారు. 

విరాట్‌ కోహ్లీకి ఉన్న ఫ్యాన్‌ ఫాలోయింగే వేరు. ఇండియాలోనే కాదు.. విదేశాల్లోనూ విరాట్‌కు వీరాభిమానులున్నారు. ఆసియా కప్‌ సందర్భంగా పాక్ తో జరిగిన మ్యాచ్ లోనూ ఓ అభిమాని హల్ చల్ చేశాడు. కోహ్లీ సంతకం చేసిన జెర్సీని పొందేందుకు పాకిస్థాన్‌కు చెందిన పలువురు ఆటగాళ్లు ఆసక్తిచూపారు. ఇంకొందరు అభిమానులు కోహ్లీని కలిసి అతడితో సెల్ఫీలు, ఆటోగ్రాఫ్‌లు తీసుకున్నారు. విరాట్‌ వారితో స్నేహపూర్వకంగా మెలిగాడు. అభిమానులకు ఎంతో ప్రాధాన్యతనిచ్చే ఈ మాజీ కెప్టెన్‌ హాంగ్ కాంగ్ మ్యాచ్ లో మరోసారి తన మంచితనాన్ని చాటుకున్నాడు. 

దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ స్టేడియంలో బుధవారం భారత్‌, హాంకాంగ్‌ జట్లు తలపడగా.. టీమిండియా గ్రేట్ విక్టరీ కొట్టింది.