RCB vs DC : చెలరేగిన విరాట్ కోహ్లీ.. ఢిల్లీ టార్గెట్ 175

RCB vs DC : చెలరేగిన విరాట్ కోహ్లీ.. ఢిల్లీ టార్గెట్ 175

చిన్నస్వామి స్టేడియంలో జరుగుతోన్న రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్‌ మ్యాచ్ లో.. బెంగళూరు 174 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 1 74 పరుగులు చేసింది.

టాప్ ఆర్డర్ దాటిగా ఆడినా త్వరత్వరగా వికెట్లు పడే సరికి భారీ స్కోరు చేయలేకపోయింది. వికెట్ పడకుండా ఆపేందుకు మిడిల్ ఆర్డర్ నెమ్మదిగా ఆడారు. ఓపెనర్లు విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ (50, 34 బంతుల్లో)తో చెలరేగాడు. కెప్టెన్ డుప్లెసిస్ (22, 16 బంతుల్లో) మంచి ఆరంభాన్ని అందించినా.. తక్కువ స్కోరుకే ఔట్ అయ్యాడు. తర్వాత వచ్చిన బ్యాట్స్ మెన్ మహిపాల్ లామ్ రోర్ (26, 18 బంతుల్లో), మాక్స్ వెల్ (24, 14 బంతుల్లో) ఢిల్లీ బౌలర్లపై ఎదురుదాడి చేసినా.. ఎక్కువ సేపు క్రీజులో నిల్వ లేకపోయారు. దాంతో 150 పరుగుల్లోనే బెంగళూరు 5 కీలక వికెట్లు కోల్పోయింది. 

చివర్లో అహ్మద్ (20, 12 బంతుల్లో), అనుజ్ రావత్ (15, 22 బంతుల్లో) మరో వికెట్ పడకుండా స్కోర్ ను పెంచే ప్రయత్నం చేశారు. ఫినిషర్ రోల్ లో వచ్చిన దినేష్ కార్తిక్ మరోసారి ఫెయిల్ అయ్యాడు. కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో గోల్డెన్ డక్ గా పెవిలియన్ చేరాడు. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్, మిచెల్ మార్ష్ చెరో రెండు వికెట్లు, అక్షర్ పటేల్, లలిత్ యాదవ్ కు తలా ఓ వికెట్ పడగొట్టారు.