KOHLI: అంతర్జాతీయ క్రికెట్లో కోహ్లీ మరో మైలురాయి

KOHLI: అంతర్జాతీయ క్రికెట్లో కోహ్లీ మరో మైలురాయి

పరుగుల రన్ మిషన్ టీమిండియా విరాట్ కోహ్లీ మరో రికార్డ్ సృష్టించాడు.  అంతర్జాతీయ క్రికెట్లో 25 వేల పరుగుల మైలురాయిని పూర్తి చేసుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరుగుతోన్న రెండో టెస్టులో కోహ్లీ ఈ ఘనత సాధించాడు.  భారత్ నుంచి ఈ ఘనత  సాధించిన రెండో ప్లేయర్ గా కోహ్లీ నిలిచాడు.

 ఇప్పటి వరకు కోహ్లీ  టెస్టుల్లో 8183, వన్డేల్లో 12,809, టీ 20ల్లో4008 పరుగులు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగుల చేసిన లిస్ట్ లో కోహ్లీ 6వ స్థానంలో ఉన్నాడు. 34,357 పరుగులతో సచిన్ టెండుల్కర్ టాప్ ప్లేసులో ఉన్నాడు. ఆ తర్వాత సంగాక్కర 28,016 ,పాంటింగ్ 27,483, జయవర్దెనె 25,957,  కలీస్ 25,534 పరుగులతో ఉన్నారు.