ఆసీస్ సిరీస్ కి కీలక ప్లేయర్లు దూరం.. వరల్డ్ కప్ కు ముందు టీమిండియా తప్పు చేస్తుందా..?

ఆసీస్ సిరీస్ కి కీలక ప్లేయర్లు దూరం.. వరల్డ్ కప్ కు ముందు టీమిండియా తప్పు చేస్తుందా..?

టీమిండియా స్టార్ ప్లేయర్లు అతి జాగ్రత్త తీసుకుంటున్నారో.. లేకపోతే ముందు చూపుతో వెళ్తున్నారో అర్ధం కావడం లేదు. వచ్చే నెలలో స్వదేశంలో వరల్డ్ కప్ పెట్టుకొని రెస్ట్ పేరుతో ఆసీస్ సిరీస్ కి దూరం అయ్యారు. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ,హార్దిక్ పాండ్య, జస్ప్రీత్ బుమ్రా ఈ లిస్టులో ఉన్నారు. చాలా రోజుల తర్వాత ఆసియా కప్ ద్వారా వన్డే ఆడిన వీరు ఇంతలోనే ఎలా అలసిపోయారు అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

ALSO READ: అశ్విన్ తో మాట్లాడా.. వరల్డ్ కప్ కి వచ్చేస్తున్నాడు: రోహిత్ శర్మ

భయమా..? జాగ్రత్తా..?
     
స్వదేశీ పిచ్ ల మీద టీమిండియా ప్లేయర్లకు అపార అనుభవం ఉన్నా.. ఆస్ట్రేలియా జట్టుపై వన్డే సిరీస్ ఆడి గెలిస్తే వరల్డ్ కప్ కి మరింత ఆత్మ విశ్వాసంతో వెళ్లొచ్చు. కానీ టీమిండియా మాత్రం స్టార్ ప్లేయర్లకు ఎక్కడ గాయాలవుతాయో అని భయపడుతుంది. స్టార్ పేసర్ బుమ్రా,ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యకు రెస్ట్ ఇచ్చినా ఒక అర్ధం వుంది. ఎందుకంటే బుమ్రా గాయం నుంచి కోలుకొని వచ్చాడు. మరోవైపు హార్దిక్ గతకొంతకాలంగా బిజీ క్రికెట్ ఆడుతున్నాడు. 

అయితే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి  మాత్రం రెస్ట్ ఇవ్వడంలో అర్ధం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే వీరు ఇప్పటికే చాలా సిరీస్ లకు రెస్ట్ పేరుతో జట్టుకి దూరంగా ఉంటున్నారు. విండీస్ తో టెస్ట్ సిరీస్ తర్వాత వీరు దాదాపు రెండు నెలల తర్వాత ఆసియా కప్ ఆడారు. తాజాగా ఆసియా కప్ గెలిచిన తర్వాత మరోసారి కీలకమైన ఆసీస్ తో తొలి రెండు వన్డేలకు దూరంగా ఉన్నారు. పైగా వరల్డ్ కప్ లో భారత్ తొలి మ్యాచ్ ఆసీస్ తో ఆడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మన స్టార్ ప్లేయర్లు తీసుకున్న అతి జాగ్రత్తలో అర్ధం లేదనిపిస్తుంది. 
ఇదిలా ఉండగా.. వరల్డ్ కప్ కి ముందు ఈ సిరీస్ ఆస్ట్రేలియాకి మంచి ప్రాక్టీస్ లా ఉపయోగపడుతుంది. ఈ నెల 22 నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభం అవుతుంది.