అశ్విన్ తో మాట్లాడా.. వరల్డ్ కప్ కి వచ్చేస్తున్నాడు: రోహిత్ శర్మ

అశ్విన్ తో మాట్లాడా.. వరల్డ్ కప్ కి వచ్చేస్తున్నాడు: రోహిత్ శర్మ

అదృష్టం ఎప్పుడు ఎలా తలుపు తడుతుందో చెప్పడం కష్టం. అప్పటివరకు ఆశలు వదిలేసుకున్న సమయంలో అనూహ్యంగా మన దగ్గరకు వచ్చి చేరుతుంది. ఇక కెరీర్ ముగిసింది.. వన్డేలకు వీడ్కోలు పలకడం ఖాయం అనుకున్నారంతా. పైగా వన్డేలు ఆడక దాదాపు రెండేళ్లు కావొస్తుంది. ఈ నేపథ్యంలో టీమిండియాలోనే కాదు ఏకంగా వరల్డ్ కప్ జట్టులోని స్థానం సంపాదించబోతున్నాడు ఒక సీనియర్ స్పిన్నర్. అతడెవరో కాదు భారత క్రికెట్ లో తనదైన ముద్ర వేసిన రవి చంద్రన్ అశ్విన్. 

అతడి గాయంతోనే అశ్విన్ కి అవకాశం 

స్వదేశంలో వరల్డ్ కప్ జరుగుతుండడంతో ఈ సారి ఎక్కువ మంది స్పిన్నర్లను ఎంపిక చేస్తారని భావిచారు. కానీ కుల్దీప్ యాదవ్ ని మాత్రమే ప్రధాన స్పిన్నర్ గా సెలక్ట్ చేసి.. జడేజా, అక్షర్ పటేల్ రూపంలో మరో ఇద్దరు స్పిన్ ఆల్ రౌండర్లతో సరిపెట్టేసింది. ఈ క్రమంలో యుజ్వేంద్ర చాహల్ తో పాటు అశ్విన్ కి నిరాశే ఎదురైంది. అయితే ఆసియా కప్ లో భాగంగా బంగ్లాదేశ్ మ్యాచులో అక్షర్ పటేల్ గాయపడ్డాడు. దీంతో ఆసియా శ్రీలంకతో జరిగిన ఫైనల్లో చోటు కోల్పోయాడు. అశ్విన్ స్థానంలో సుందర్ వచ్చి చేరాడు.
 
అయితే వరల్డ్ కప్ స్క్వాడ్ లో ఉన్న అక్షర్.. గాయపడడం అశ్విన్ కి కలిసి వచ్చింది. అశ్విన్ కూడా బ్యాటింగ్ చేయగలడు కాబట్టి అక్షర్ ని రీప్లేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. పైగా అనుభవం కూడా ఈ స్టార్ స్పిన్నర్ కి కలిసి రానుంది. దీంతో వరల్డ్ కప్ జట్టులో అశ్విన్ రాక ఖాయమైంది. 

ALSO READ:  పుజారాకు ఊహించని షాక్.. సస్పెండ్ చేస్తన్నట్టు ప్రకటన

రోహిత్ నుంచి కాల్ 

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అశ్విన్ వరల్డ్ కప్ లో ఆడతాడని హింట్ ఇచ్చేసాడు. అశ్విన్ తో తాను ఫోన్ లో మాట్లాడానని.. వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీలో అశ్విన్ అనుభవం మాకు చాలా ముఖ్యమని చెప్పుకొచ్చాడు. దీంతో అశ్విన్ వరల్డ్ కప్ కి వస్తున్నట్టు రోహిత్ పరోక్షంగా చెప్పేసాడు. ప్రస్తుతం స్వదేశంలో భారత్.. ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. నిన్న ప్రకటించిన 15 మంది ప్రాబబుల్స్ లో అశ్విన్ చోటు సంపాదించిన సంగతి తెలిసిందే. మొత్తానికి అక్షర్ గాయం అశ్విన్ వరల్డ్ కప్ ఆశలు ఇంకా అలాగే ఉంచింది.