క్రికెట్ మ్యాచ్‌‌‌‌లో ఎదురయ్యే క్లిష్ట పరిస్థితులు ఉత్సాహాన్నిస్తాయి : కోహ్లీ

క్రికెట్ మ్యాచ్‌‌‌‌లో ఎదురయ్యే  క్లిష్ట పరిస్థితులు ఉత్సాహాన్నిస్తాయి : కోహ్లీ

బెంగళూరు : క్రికెట్‌‌‌‌ కెరీర్​లో 15 ఏళ్లు ముగిసినా ఇప్పటికీ  మ్యాచ్‌‌‌‌లో ఎదురయ్యే క్లిష్ట పరిస్థితులు కొత్త ఉత్సాహాన్నిస్తాయని కింగ్‌‌‌‌ కోహ్లీ అన్నాడు. కెరీర్‌‌‌‌లో ఎన్నో అడ్డంకులు అధిగమించినా రాబోయే వన్డే వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ తనకు కొత్త సవాలు విసరనుందన్నాడు. ‘మీ ముందు ఎలాంటి సవాలు ఉన్నా దాన్ని స్వీకరించండి. క్లిష్ట పరిస్థితి ఎదురైనప్పుడు మరింత ఉత్సాహంగా ఉండండి. దానికి దూరంగా ఉండేందుకు ప్రయత్నించొద్దు. ఇన్నేళ్ల తర్వాత కూడా నేను పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటా. అదే నన్ను ఉత్తేజపరుస్తుంది. మరో స్థాయికి వెళ్లడానికి తోడ్పడుతుంది’ అని కోహ్లీ వ్యాఖ్యానించాడు. 

తనపైనా, టీమ్‌‌‌‌పైనా అధిక ఒత్తిడి ఉందని అంగీకరించిన కోహ్లీ.. ఓ ప్లేయర్‌‌‌‌గా వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ గెలవాలని ఎవరైనా కోరుకోకుండా ఉంటారా? అని ప్రశ్నించాడు. ‘2011 వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ గెలవడం నా కెరీర్‌‌‌‌లో హైలెట్‌‌‌‌. అప్పుడు నా వయసు 23 ఏళ్లు. ఆ టైమ్‌‌‌‌లో సీనియర్ల మనోభావాలను నేను అర్థం చేసుకోలేకపోయాను. కానీ ఇప్పుడు 34 ఏళ్లు. ఇప్పటికే ఎన్నో వరల్డ్‌‌‌‌ కప్స్‌‌‌‌ ఆడా. కాబట్టి సీనియర్ల భావోద్వేగాలను అర్థం చేసుకున్నా’ అని కోహ్లీ వ్యాఖ్యానించాడు.