
భారత్, ఆసీస్ జట్ల మధ్య జరుగుతోన్న నాలుగో టెస్టు మ్యాచ్ మూడో రోజు ఆట ముగిసింది. 36/0 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా ఆట ముగిసేసమయానికి 289/3 స్కోరుతో కొనసాగుతోంది. ఇంకా ఆసీస్ కంటే భారత్ 191 పరుగుల వెనుకంజలో ఉంది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (128) సెంచరీ సాధించగా విరాట్ కోహ్లీ (59*) హాఫ్ సెంచరీతో క్రీజ్‌లో ఉన్నాడు. అంతకుముందు రోహిత్ శర్మ (35), పుజారా (42) పరుగులు సాధించారు. ప్రస్తుతం క్రీజ్లో రవీంద్ర జడేజా (16*), విరాట్ కోహ్లీ (59*) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. ఆసీస్ బౌలర్లు లయన్, కునెమన్, మర్ఫీ తలో వికెట్ తీశారు.
14 నెలల తర్వాత కోహ్లీ హాఫ్ సెంచరీ..
దాదాపు 14 నెలల తర్వాత కోహ్లీ అర్ధ శతకం బాదాడు. టెస్టుల్లో గత 16 ఇన్సింగ్స్‌ల్లో కోహ్లీకి ఇదే ఫస్ట్ హాఫ్ సెంచరీ కావడం గమనార్హం. టెస్టు కెరీర్ లో అతనకి ఇది 29వ హాఫ్ సెంచరీ కావడం విశేషం. గతేడాది జనవరిలో కేప్ టౌన్ లో దక్షిణాఫ్రికాపై కోహ్లీ హాఫ్ సెంచరీ బాదాడు.