బంగ్లాపై విరాట్ కోహ్లీ సెంచరీ

బంగ్లాపై విరాట్ కోహ్లీ సెంచరీ

బంగ్లాదేశ్తో జరగుతున్న మూడో వన్డేలో విరాట్ కోహ్లీ చెలరేగిపోయాడు. తన ఖాతాలో మరో సెంచరీ నమోదు చేసుకున్నాడు. బంగ్లా బౌలర్లకు చుక్కులు చూపిస్తూ ఆకాశమే హద్దుగా వీర విహారం చేశాడు. వన్డేల్లో 72వ సెంచరీ నమోదు చేశాడు.  మైదానం నలువైపులా బౌండరీలు బాదాడు.91 బంత్లులో 113 పరుగులు చేసి ఔటయ్యాడు. అందులో రెండు సిక్స్ లు, 11 ఫోర్లు ఉన్నాయి. 

71వ సెంచరీ మార్కుని అందుకోవడానికి విరాట్ కోహ్లీకి మూడేండ్లు ఎదురుచూడాల్సి వచ్చింది. ఆసియా కప్‌లో టీ20ల్లో 71వ శతకాన్ని అందుకున్న రన్ మెషిన్.. మూడు నెలల గ్యాప్‌లోనే వన్డేలో  అద్భుతమైన సెంచరీ  నమోదు చేశాడు. తొలి రెండు వన్డేల్లో సింగిల్ డిజిట్ స్కోరుకే పెవిలియన్ చేరిన విరాట్ కోహ్లీ... బంగ్లాదేశ్‌తో జరుగుతున్న చివరి మ్యాచ్‌లో 85 బంతుల్లో శతకాన్ని అందుకున్నాడు.

విరాట్ కోహ్లీ 72వ సెంచరీ నమోదు చేయడంతో  రికీ పాంటింగ్ నెలకొల్పిన 71 సెంచరీల రికార్డును అధిగమించేశాడు. సచిన్ టెండూల్కర్ ఒక్కడే 100 సెంచరీలతో విరాట్ కంటే ముందున్నాడు. వన్డేల్లో 44వ సెంచరీ నమోదు చేసిన విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్ 49 సెంచరీల రికార్డుకు మరింత చేరువయ్యాడు. 

విరాట్ కన్న ముందు  ఇషాన్ కిషన్  డబుల్ సెంచరీ సాధించాడు. 126 బంతుల్లోనే ఇషాన్  ద్విశతకాన్ని నమోదు చేశాడు. ఇషాన్ ఇన్నింగ్స్లో 24 ఫోర్లు, 10 సిక్సర్లతో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.131 బంతుల్లో 210 పరుగులు చేసి ఔటయ్యాడు.