Cricket World Cup 2023: నీ దూకుడుకు సాటెవ్వరు: వరల్డ్ కప్‌లో బెస్ట్ ఫీల్డర్ గా విరాట్ కోహ్లీ..

Cricket World Cup 2023: నీ దూకుడుకు సాటెవ్వరు: వరల్డ్ కప్‌లో బెస్ట్ ఫీల్డర్ గా విరాట్ కోహ్లీ..

ప్రస్తుత జనరేషన్ లో విరాట కోహ్లీ టాప్ బ్యాటర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఫార్మాట్ ఏదైనా కింగ్ పరుగుల వరద పారిస్తాడు. ఈ విషయం అందరికీ తెలిసిన ఇప్పుడు కోహ్లీ ఫీల్డింగ్  విషయంలో కూడా టాప్ లో ఉన్నాడు. అదేంటి కోహ్లీ ఫీల్డింగ్ లో టాప్ ఏంటి అనుకుంటున్నారా..? అయితే ఈ స్టోరీ చదివేయాల్సిందే.

వరల్డ్ కప్ లో ప్రస్తుతం అన్ని జట్లు దాదాపుగా మూడు మ్యాచులు ఆడేశాయి. ఈ మూడు మ్యాచుల్లో ఎవరు గొప్పగా ఫీల్డింగ్ చేశారనే విషయాన్ని పరిశీలిస్తే విరాట్ కోహ్లీ అని తేలింది. 2023 ప్రపంచ కప్‌లో మొదటి మూడు గేమ్‌ల తర్వాత విరాట్ కోహ్లీ మైదానంలో అత్యధిక ప్రభావం చూపే ఆటగాడిగా ఐసిసి రేటింగ్ ఇచ్చింది. టోర్నీ ప్రారంభమైన 13 రోజుల తర్వాత ఇక ఇచ్చిన ఈ రేటింగ్ లో కోహ్లీకి 22.30 రేటింగ్ పాయింట్లతో టాప్ లో నిలిచాడు. విరాట్ కోహ్లీ గొప్ప బ్యాటర్ తో గ్రేట్ ఫీల్డర్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 

క్రికెట్ లో ఇప్పటివరకు తన ఫీల్డింగ్ విన్యాసాలతో అదరగొట్టిన కోహ్లీ ఈ అవార్డు అందుకోవడంలో పెద్దగా ఆశ్చర్యం లేదనే చెప్పాలి.దీంతో ప్రస్తుతం ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. కాగా.. ఈ టోర్నీలో విరాట్ మైదానంలో ఎంతో చురుగ్గా ఉండడంతో పాటు మూడు గ్రేట్ క్యాచులని అందుకున్నాడు. ఆస్ట్రేలియాపై విరాట్..   మిట్చెల్ మార్ష్ అందుకున్న క్యాచ్ ఈ టోర్నీకే హైలెట్ గా  మారింది. కాగా.. కోహ్లీ తర్వాతి స్థానంలో ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు రూట్(21.73), వార్నర్ (21.32) తర్వాతి స్థానాల్లో నిలిచారు.