WPL 2024 Final: బెంగళూరుకు టైటిల్.. సంతోషం పట్టలేక కోహ్లీ డ్యాన్స్

WPL 2024 Final: బెంగళూరుకు టైటిల్.. సంతోషం పట్టలేక కోహ్లీ డ్యాన్స్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కల నెరవేరింది. ఇప్పటివరకు 16 సీజన్ లు ఆడినా మెన్స్ సాధించలేని ఘనతను రెండో సీజన్ లోనే మహిళలు గెలిచి ఫ్యాన్స్ కరువు తీర్చారు. ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి సరి కొత్త చరిత్ర సృష్టించారు. ఇప్పటి వరకూ రెండుసార్లు ఐపీఎల్ ఫైనల్ చేరినా టైటిల్ సాధించలేకపోయిన ఆ ఫ్రాంఛైజీకి ఇప్పుడు మహిళల టీమ్ వుమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్ 2024) టైటిల్ సాధించి పెట్టింది. దీంతో మ్యాచ్ తర్వాత కోహ్లి స్పెషల్ గా వీడియో కాల్ చేసి స్మృతి అండ్ టీమ్ తో మాట్లాడాడు.

దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. కోహ్లి మొదట కెప్టెన్ స్మృతితో మాట్లాడాడు. ఆ తర్వాత మొత్తం టీమ్ కు కూడా విషెస్ చెప్పాడు. విరాట్ ను చూడగానే ఆర్సీబీ గాళ్స్ ఆనందంతో గంతులేశారు. విరాట్ కోహ్లి RCB యొక్క టైటిల్ విన్‌ను సెలబ్రేట్ చేస్తున్నప్పుడు కోహ్లీ ఆనందంతో డ్యాన్స్ వేయడం హైలెట్ గా మారింది. అంతేకాదు ఆర్సీబీ సూపర్ వుమెన్ ను పొగుడుతూ ఇన్‌స్టాగ్రామ్ లో కోహ్లి ఓ పోస్ట్ కూడా చేశాడు. ఇక ఐపీఎల్లో ఆర్సీబీకి ప్రస్తుతం ఆడుతున్న మ్యాక్స్‌వెల్, గతంలో ఆడిన క్రిస్ గేల్ కూడా కంగ్రాట్స్ చెప్పారు.

ALSO READ | WPL 2024 Final: మన ప్లేయర్‌కే పర్పుల్ క్యాప్.. ఎవరీ శ్రేయాంక పాటిల్..?

టాస్‌‌‌‌‌‌‌‌ గెలిచిన ఢిల్లీ 18.3 ఓవర్లలో 113 రన్స్‌‌‌‌‌‌‌‌కే ఆలౌటైంది. షెఫాలీ వర్మ (27 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 44), మెగ్‌‌‌‌‌‌‌‌ లానింగ్‌‌‌‌‌‌‌‌ (23 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 3 ఫోర్లతో 23) రాణించగా, ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో ఏడుగురు సింగిల్‌‌‌‌‌‌‌‌ డిజిట్‌‌‌‌‌‌‌‌కే పరిమితమయ్యారు. తర్వాత బెంగళూరు 19.3 ఓవర్లలో 115/2 స్కోరు చేసి గెలిచింది. రిచా ఘోష్‌‌‌‌‌‌‌‌ (17 నాటౌట్‌‌‌‌‌‌‌‌) విన్నింగ్‌‌‌‌‌‌‌‌ ఫోర్‌‌‌‌‌‌‌‌తో ఆర్‌‌‌‌‌‌‌‌సీబీకి చిరస్మరణీయ విజయాన్ని అందించింది. మొనులిక్స్​కు ‘ప్లేయర్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌‌‌‌‌’ అవార్డు లభించింది. 

శ్రేయాంక పాటిల్‌‌‌‌‌‌‌‌ (4/12), సోఫీ మొనులిక్స్‌‌‌‌‌‌‌‌ (3/20) సూపర్‌‌‌‌ బౌలింగ్‌‌కు తోడు  ఛేజింగ్‌‌‌‌‌‌‌‌లో ఎలైస్‌‌‌‌‌‌‌‌ పెర్రీ (37 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 4 ఫోర్లతో 35 నాటౌట్‌‌‌‌‌‌‌‌), సోఫీ డివైన్‌‌‌‌‌‌‌‌ (32), కెప్టెన్‌‌‌‌‌‌‌‌ స్మృతి మంధాన (31) మెరుగ్గా ఆడటంతో.. ఆదివారం జరిగిన టైటిల్‌‌‌‌‌‌‌‌ ఫైట్‌‌‌‌‌‌‌‌లో ఆర్‌‌‌‌‌‌‌‌సీబీ 8 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌‌‌‌‌‌‌‌ను ఓడించింది.