హైదరాబాద్, వెలుగు: తన ప్లాటినం, క్లాసిక్ క్రెడిట్, డెబిట్ కార్డ్ హోల్డర్లకు అదనపు ప్రయోజనాలను అందిస్తున్నట్లు వీసా ప్రకటించింది. రోజువారీ ఖర్చులపై డిస్కౌంట్లు వంటి ప్రయోజనాలు ఇస్తామని తెలిపింది. దీనివల్ల దాదాపు 29 కోట్ల కార్డుదారులకు ప్రయోజనం ఉంటుంది.
స్విగ్గీ, జెప్టో, మీషో, ఇన్‌స్టామార్ట్, అభీబస్ వంటి బ్రాండ్లతో వీసా ఒప్పందం కుదుర్చుకుంది. సోనీలివ్, జీ5 వంటి ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు, లైఫ్‌స్టైల్, షాపర్స్ స్టాప్, మ్యాక్స్, లులు, మోర్, స్టార్ బజార్ రిటైల్ భాగస్వాములని వీసా తెలిపింది.
