పాక్‌‌లో గురుద్వారాకు వెళ్లాలంటే వీసా అక్కర్లేదు

పాక్‌‌లో గురుద్వారాకు వెళ్లాలంటే వీసా అక్కర్లేదు

న్యూఢిల్లీ: కర్తార్‌‌పూర్‌‌ కారిడార్‌‌ ఒప్పందంపై  బుధవారం సమావేశమైన ఇండియా, పాకిస్తాన్‌‌ ప్రతినిధుల హైలెవల్‌‌ మీటింగ్‌‌  ‘వీసా ఫ్రీ ట్రావెల్‌‌’ కు అంగీకరించింది.  పాకిస్తాన్‌‌లోని గురుద్వారా దర్బార్‌‌ సాహిబ్ ను మన యాత్రికులు వీసా ఫ్రీ ద్వారా వెళ్లడానికి ఇండియా, పాకిస్తాన్‌‌ లు అంగీకరించాయి.  గురుద్వారా ను సందర్శించిన యాత్రికులపై సర్వీసు చార్జీ వసూలు చేయాలని,  గురుద్వారా దగ్గర ఇండియన్‌‌ కౌన్సిలర్‌‌ లేదా ప్రోటో కాల్‌‌ ఆఫీసర్లును ఉంచొద్దని పాకిస్తాన్‌ విధించిన రెండు షరతులపై మాత్రం మన దేశం అభ్యంతరం చెప్పింది.

ఈ రెండు నిర్ణయాలపై మరోసారి ఆలోచించుకోవాలని మనదేశం పాక్‌‌ను కోరింది. అయినా పాకిస్తాన్‌‌ ఈ విషయంలో తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. ఈమీటింగ్‌‌లో పాల్గొన్న హోం మినిస్ట్రీ జాయింట్‌‌ సెక్రటరీ ఎస్‌‌.సి.ఎల్‌‌.దాస్‌‌ మీడియాతో మాట్లాడుతూ కారిడార్‌‌పై తుది ఒప్పందం కుదరలేదని చెప్పారు.

ఇవీ నిర్ణయాలు

కర్తార్‌‌పూర్‌‌ కారిడార్‌‌ను ఉపయోగించి  ఓసీఐ  (ఓవర్సీస్ సిటిజన్‌‌ షిప్‌‌ ఆఫ్‌‌ ఇండియా)  కార్డులున్న ఇండియన్ సంతతివాళ్లు  గురుద్వారాకు  వెళ్లొచ్చు. కారిడార్‌‌ ద్వారా రోజూ 5 వేల మంది యాత్రికులు  గురుద్వారాను సందర్శించుకోవచ్చు. ప్రత్యేక పరిస్థితుల్లో ఈ సంఖ్యను పెంచుకునే అవకాశం కూడా ఉంది. ఏడాదిపాటు భక్తులు గురుద్వారాను దర్శించుకోవచ్చు. బుధి రావి చానెల్‌‌ దగ్గర బ్రిడ్జి కట్టడానికి ఓకే.