ఆకట్టుకున్న విశాక స్టాల్

 ఆకట్టుకున్న విశాక స్టాల్

గ్రీన్​ బిల్డింగ్స్​ నిర్మాణానికి అనువైన ప్రొడక్టులను తయారు చేసే విశాక ఇండస్ట్రీస్ ఈ షోలో ఏర్పాటు చేసిన స్టాల్ ​ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. సంస్థ తయారు చేసే సోలార్​ రూఫ్​, సిమెంట్, ఫైబర్​తో తయారు చేసిన వీబోర్డ్స్​ షీట్స్​, వీప్యానెల్స్​(డిజైనర్​ బోర్డ్స్), ఎలక్ట్రిక్​ బైక్​ వేడర్​ను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. ఈ సందర్భంగా సంస్థ సీనియర్​ ఎగ్జిక్యూటివ్​లు ‘వెలుగు’తో మాట్లాడుతూ ‘‘వీబోర్డ్స్​షీట్స్ ఇటుక గోడల కంటే 10 రెట్లు తేలికగా ఉంటాయి. ఇటుక గోడల కంటే 35శాతం సన్నగా ఉంటాయి.  కార్పెట్ ఏరియాను 4 శాతం పెంచుతాయి. క్యూరింగ్, ప్లాస్టరింగ్​ అవసరం లేదు. పెయింటింగ్, లేబర్​ ఖర్చులను తగ్గిస్తాయి. 

వాల్ ప్యానెలింగ్,   గ్రిడ్ ఫాల్స్ సీలింగ్, ఫాల్స్ సీలింగ్,  కిచెన్ క్యాబినెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, షెల్వ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు,  వార్డ్​రోబ్​లకు వీటిని వాడొచ్చు. గ్రీన్ ​బిల్డింగ్​కు మరో కీలకమైన ప్రొడక్టు వీనెక్స్ట్​ ప్రీమియం షీట్స్​. ఇది పర్యావరణ అనుకూలమైన సిమెంట్ బోర్డు .  డక్ట్ కవరింగ్,   కాంపౌండ్ వాల్ క్లాడింగ్, గార్డెన్ ఫెన్సింగ్,    గేట్ క్లాడింగ్,  కాంపౌండ్ వాల్ పొడిగింపుకు వాడుకోవచ్చు.   లైట్ వెయిట్ ఈపీఎస్​ కాంక్రీటుతో ఇవి తయారవుతాయి.  మా మరో ప్రొడక్టు సోలార్​ రూఫ్​. సాధారణ సోలార్​ ప్యానెల్స్​తో పోలిస్తే ఇది అదనంగా 20శాతం కరెంటును తయారు చేస్తుంది. 25 ఏళ్ల వరకు మన్నుతుంది. ఈ 25 ఏళ్లలో మీ పెట్టుబడిపై 4 రెట్ల కంటే ఎక్కువ రాబడి వస్తుంది. వాటర్​ లీకింగ్​, చెదలు వంటి సమస్యలు ఉండవు. ఇది ఫైర్​, కరెంట్ రెసిస్టెంట్ కూడా​.  మా కంపెనీ తయారు చేసిన మరో ప్రత్యేక ప్రొడక్ట్ ​ఆటమ్ వేడర్ ​​బైక్​. ఇది చూడటానికి స్టైలిష్​గా ఉండటమే కాదు నాలుగు గంటలు చార్జ్​ చేస్తే 100 కిలోమీటర్లు వెళ్తుంది. ధర రూ.1.16 లక్షలు మాత్రమే. వంద కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది”అని వివరించారు.