ప్లాస్టిక్‌ను దారాలుగా మారుస్తున్నందుకు అవార్డ్

ప్లాస్టిక్‌ను దారాలుగా మారుస్తున్నందుకు అవార్డ్
  • ప్లాస్టిక్‌ను దారాలుగా మారుస్తున్నందుకు అవార్డ్
  • అవార్డ్ అందించిన బీడబ్ల్యూ బిజినెస్‌ వరల్డ్‌

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: పర్యావరణానికి హాని కలిగించే ప్రొడక్ట్‌‌లను రీసైక్లింగ్ చేస్తున్న వ్యక్తులకు బీడబ్ల్యూ బిజినెస్‌‌వరల్డ్ అవార్డులను ఇవ్వగా, విశాక ఇండస్ట్రీస్‌‌ జాయింట్ ఎండీ జీ వంశీ కృష్ణ యంగ్‌‌ లీడర్‌‌‌‌ అవార్డును అందుకున్నారు. వండర్‌‌‌‌ యార్న్‌‌ బిజినెస్ ద్వారా ప్లాస్టిక్ బాటిల్స్‌‌ను దారాలుగా (బట్టల్లో వాడేవి) విశాక ఇండస్ట్రీస్ మారుస్తున్న విషయం తెలిసిందే. ఈ బిజినెస్‌‌ మోడల్‌‌కు మెచ్చిన బీడబ్ల్యూ బిజినెస్ వరల్డ్‌‌ టీమ్‌‌,  రీసైక్లింగ్‌‌లో యంగ్ లీడర్‌‌‌‌ (అండర్ 40) కేటగిరీ కింద వంశీ కృష్ణకు అవార్డు ఇచ్చారు. గ్లాస్‌‌పవర్‌‌‌‌ రీసైక్లింగ్‌‌తో కలిసి  ‘రీసైక్లింగ్‌‌–ఫర్‌‌‌‌ గ్రీనర్ టుమారో, అవార్డ్స్‌‌, కాన్‌‌క్లేవ్‌‌’ మొదటి ఎడిషన్‌‌ను బీడబ్ల్యూ బిజినెస్‌‌వరల్డ్ ప్రకటించింది. వేస్ట్ మేనేజ్‌‌మెంట్‌‌, సస్టయినబిలిటీ, ఎన్వీరాన్‌‌మెంట్‌‌, రీసైక్లింగ్ వంటి అంశాల్లో ఒకేలా ఆలోచిస్తున్నవారిని ఒక వేదిక మీదకు తీసుకొచ్చేందుకు ఈ కాన్‌‌క్లేవ్‌‌ను నిర్వహించామని ఈ సంస్థ చెబుతోంది. రీసైక్లింగ్ సెగ్మెంట్‌‌లో ఇప్పటికే అనేక మార్పులు తీసుకొచ్చిన వారిని గుర్తించడం ఈ కాన్‌‌క్లేవ్‌‌ ముఖ్య ఉద్దేశమని పేర్కొంది. మొత్తం ఏడు కేటగిరీలలో అవార్డులను ప్రకటించారు. ఈవెంట్ ఆన్‌‌లైన్‌‌లో జరిగింది.  వండర్‌‌‌‌ యార్న్‌‌ ఇప్పటి వరకు 15 కోట్ల బాటిళ్లను రీసైకిల్ చేసి దారాలుగా మార్చిందని విశాక ఇండస్ట్రీస్ పేర్కొంది. ఈ అవార్డుల కోసం నామినేషన్స్‌‌ను పిలవగా, వండర్ యార్న్‌‌ గురించి జ్యూరికి కంపెనీ వివరించింది. ప్యానెల్ డిస్కషన్‌‌లో ఆటమ్ సోలార్‌‌‌‌ రూఫ్‌‌లను గురించి కూడా వివరించామని పేర్కొంది.