విశాక ఇండస్ట్రీస్ ఆదాయం రూ. 358 కోట్లు

విశాక ఇండస్ట్రీస్ ఆదాయం రూ. 358 కోట్లు

హైదరాబాద్​, వెలుగు: విశాక ఇండస్ట్రీస్ లిమిటెడ్‌‌కు డిసెంబర్ 31, 2022తో ముగిసిన మూడో క్వార్టర్​లో  రూ. 358.95  కోట్ల ఆదాయం వచ్చింది. అయితే  సెప్టెంబర్ 30, 2022తో ముగిసిన రెండో క్వార్టర్​లో 366.95 కోట్ల ఆదాయం సాధించింది. క్యూ3 లో   కంపెనీకి రూ. 3.35 కోట్ల లాభం వచ్చింది. సెప్టెంబర్ క్వార్టర్​లో 7.375 కోట్ల నికరలాభం వచ్చింది. కంపెనీ ఈపీఎస్​ తాజా క్వార్టర్​లో రూ. 1.94 ఉంది. సెప్టెంబరు క్వార్టర్​లో రూ.4.27 ఉంది. సంవత్సరం లెక్కన మొత్తం ఆదాయం రూ.357.14  కోట్ల నుంచి రూ.358.95 కోట్లకు పెరిగింది.  నికర లాభం రూ.23.98 కోట్ల నుంచి రూ.3.35 కోట్లకు పడిపోయింది. ఇదే కాలంలో ఈపీఎస్‌‌ రూ.14.14 నుంచి రూ.1.94లకు పడిపోయింది.  డిసెంబర్ 31, 2021తో ముగిసిన 9 నెలల కాలంలో కంపెనీకి రూ.1002.86  కోట్ల ఆదాయం రాగా, డిసెంబర్ 31, 2022తో ముగిసిన 9 నెలల కాలంలో కంపెనీ మొత్తం ఆదాయం రూ.1208.29  కోట్లుగా రికార్డయింది. ఇదే కాలంలో నికర లాభం రూ.88.48 కోట్ల నుంచి రూ.49.25 కోట్లకు తగ్గింది. ఈపీఎస్​ రూ.52.09 నుంచి రూ.28.50కి తగ్గింది. 

1981లో డాక్టర్ గడ్డం వివేకానంద్​ స్థాపించిన విశాక ఇండస్ట్రీస్ లిమిటెడ్  సిమెంట్ షీట్‌‌‌‌లు,  ఫైబర్ సిమెంట్ బోర్డుల నుంచి మొదలుకొని హైబ్రిడ్ సోలార్ రూఫ్‌‌‌‌లు, ఫైబర్ నూలు వరకు చాలా ప్రొడక్టులను తయారు చేస్తోంది. వివేకానంద్​ నాయకత్వంలో పర్యావరణ ఉత్పత్తులను అభివృద్ధి చేయడంలో,  మార్కెట్​ డిమాండ్లను తీర్చడంలో విశాక ముందంజలో ఉంది. కంపెనీ ‘ది వండర్ యార్న్‌‌‌‌’ను కూడా తయారు చేస్తోంది. దీనిని వస్త్రాలు, దుస్తులు, ఫర్నిషింగ్‌‌‌‌లు, ఆటోమోటివ్ ఫ్యాబ్రిక్స్ వంటి వాటిలో వాడుతారు.  సోలార్​ పవర్​తో నడిచే హైబ్రిడ్ రూఫ్-టాప్​ను కూడా ఉత్పత్తి చేస్తోంది. విశాక ఇండస్ట్రీస్​కు దేశంలో 12 తయారీ యూనిట్లు, 13 మార్కెటింగ్ కార్యాలయాలు,  7000 కు పైగా డీలర్ అవుట్‌‌‌‌లెట్స్​ ఉన్నాయి.