
విశాఖ కోర్టు మందుబాబులుకు గట్టి షాక్ ఇచ్చింది. గడిచిన మూడురోజుల్లో విశాఖ జిల్లాలో చేపట్టిన డంకెన్ డ్రైవ్ లో యాభై రెండు మంది మందు బాబులు పట్టుబడ్డారు. వారిని ఈరోజు ట్రాఫిక్ పోలీసలు కోర్టు ముందు హాజరుపర్చగా.. విశాఖ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ వినూత్న శిక్ష విధించింది. మందుబాబులందరూ విశాఖ బీచ్ లో ఉన్న వ్యర్ధాలను వేరేసి బీచ్ ను శుభ్ర పరచాలని అన్యుహమైన తీర్పు వెలువరించింది. దీంతో అధికారులు వారితో బీచ్ తీసుకెళ్లి చెత్త శుభ్రం చేయించారు.