డైనోసార్​ కలెక్షన్​..విశ్వజిత్ గిన్నిస్ రికార్డ్

డైనోసార్​ కలెక్షన్​..విశ్వజిత్ గిన్నిస్ రికార్డ్

త్రివేండ్రంకి చెందిన ఏడేండ్ల విశ్వజిత్.. గిన్నిస్ రికార్డ్​కి ఎక్కాడు. ఇంత చిన్న వయసులో ఏం చేశాడా? అనుకుంటున్నారా.. విశ్వజిత్​కి చిన్నప్పటి నుంచి డైనోసార్​ బొమ్మలంటే ఇష్టం. వాటితో ఆడుకోవడమే కాకుండా తన  దగ్గర ఉన్న అనేక రకాల డైనోసార్ల సైంటిఫిక్​ నేమ్స్​ తెలుసుకునే వాడు. అలా శాస్త్రీయ నామాలు (సైంటిఫిక్​ నేమ్స్​)తో వాటిని గుర్తుపెట్టుకోవడం అలవాటైపోయింది. ఒక నిమిషంలో 41 డైనోసార్ల శాస్త్రీయ నామాలను అవలీలగా చెప్తాడు. ‘నాకు యానిమల్స్ అంటే చాలా ఇష్టం. అందులోనూ జురాసిక్ పార్క్ చూసినప్పటి నుంచి డైనోసార్లంటే ఇష్టం ఇంకా పెరిగింది’ అంటాడు విశ్వజిత్.

విశ్వజిత్​ అమ్మానాన్న సింధు, విశ్వరాజ్​ ఇద్దరూ ఐటీ ప్రొఫెషనల్స్. వాళ్లు కొడుక్కి స్పెషల్ ఇంట్రెస్ట్ ఉండటాన్ని గమనించారు. ఆ పిల్లవాడిని ప్రోత్సహించారు. జురాసిక్ పార్క్ సినిమా చూసినప్పటి నుంచి విశ్వజిత్​కి ఉన్న ఇంట్రెస్ట్ గమనించి డైనోసార్లు కొనివ్వడం మొదలుపెట్టారు. డైనోసార్ బొమ్మలతో ఆడుకోవడం కంటే ముందు వాటి సైంటిఫిక్ నేమ్స్​ అడిగి తెలుసుకునేవాడు. ఇప్పుడు విశ్వజిత్​ దగ్గర ఎన్నో డైనోసార్​బొమ్మల​తో పాటు పుస్తకాలు కూడా ఉన్నాయి. 

డ్రాయింగ్ కూడా..

 మూడేండ్ల వయసు నుంచే విశ్వజిత్​కు డ్రాయింగ్​ అంటే కూడా చాలా ఇష్టం. డైనోసార్ బొమ్మలతో మరికొన్ని జంతువుల బొమ్మలుగీసేవాడు. బ్లాక్ స్కెచ్​ పెన్, కలర్​ పెన్సిల్​తో 30 నిమిషాలు ఆపకుండా డ్రాయింగ్ వేశాడు. అంతేకాదు తన ఊహతో క్రియేటివ్​గా 23 సముద్ర వాతావరణాలను గీశాడు. కలరింగ్ కాంపిటీషన్స్​లో కేరళలో జరిగిన కల్చరల్ ఫెస్టివల్​లో సెకండ్ ప్రైజ్ గెలిచాడు. 

విశ్వజిత్​ టాలెంట్​కి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్​, ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ దక్కాయి. వాటితోపాటు సూపర్ టాలెంటెడ్ కిడ్ వన్ ఇన్​ ఎ మిలియన్​ అవార్డ్, కలామ్ వరల్డ్ రికార్డ్​లు కూడా వరించాయి.