
మాస్ క దాస్ విష్వక్ సేన్(Vishwak Sen) ప్రధాన పాత్రలో దర్శకుడు విద్యాధర్(Vidyadhar) కాగిత తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ గామి(Gaami). వి సెల్యులాయిడ్ పతాకంపై కార్తీక్ శబరీష్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అఘోరా గ సరికొత్త అవతారంలో కనిపించనున్నాడు విష్వక్ సేన్. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఇప్పటివరకు చూడని సరికొత్త కథతో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. ఇటీవల విడుదలైన గామి ఫస్ట్ లుక్ తో ఆ అంచనాలు రెట్టింపు అవగా.. తాజాగా ఈ సినిమా నుండి టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్.
గామి టీజర్ చాలా కొత్తగా ఉంది. ముందు నుండి మేకర్స్ చెప్పినట్టుగానే ఎదో సరోకొత్తగా చూపించబోతున్నారు అనే ఫీలింగ్ కలుగుతోంది టీజర్ చూస్తుంటే. అంతేకాదు.. విజువల్స్ అండ్ మ్యూజిక్ కూడా సరికొత్తగా ఉన్నాయి. ఇదే నీ సమస్యకు పరిష్కారం, ఇవన్నీ దాటుకొని నావల్ల అవుతుందంటారా.. అంటూ వినిపించిన డైలాగ్స్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. అఘోరా లుక్ లో విశ్వక్ సరికొత్తగా కనిపిస్తున్నారు. మొత్తంగా గామి టీజర్ సినిమాపై అంచనాలను పెంచుతోంది. ఇక ఫిబ్రవరి 29న గామి ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్.
మార్చ్ 8న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దాదాపు నీలుగేళ్ల క్రితం మొదలైన ఈ సినిమా కేవలం క్రౌడ్ ఫండింగ్ తో తెరకెక్కుతోంది. విశ్వక్ కూడా ఈ సినిమా చాలా కాలంగా కష్టపడుతున్నారు. కేవలం సినిమాలోని కంటెంట్ ఉన్న నమ్మకమే దానికి కారణం.మరి సరికొత్త కథా, కథనాలతో వస్తున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.