Pushpa 3: బెర్లిన్ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో అల్లు అర్జున్.. పుష్ప 3పై క్లారిటీ ఇచ్చేశాడు!

Pushpa 3: బెర్లిన్ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో అల్లు అర్జున్.. పుష్ప 3పై క్లారిటీ ఇచ్చేశాడు!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా వచ్చిన పుష్ప(Pushpa) సినిమా సంచనల విజయం సాదించిన విషయం తెలిసిందే. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్(Sukumar) తెరకెక్కించిన ఈ సినిమా ఇంటర్నేషనల్ వైడ్ క్రేజ్ సంపాదించుకుంది. ఈ సినిమాలో పుష్పరాజ్ గా బన్నీ మ్యానరిజమ్స్, డాన్స్, డైలాగ్స్ కు ప్రపంచం మొత్తం ఫిదా అయిపోయింది. దేశవిదేశాల క్రికెటర్స్ సైతం పుష్పరాజ్ మ్యానరిజమ్స్ ను ఫాలో చేస్తూ తెగ వైరల్ చేశారు. ఇక కలెక్షన్స్ పరంగా కూడా అదే రేంజ్ వచ్చాయి ఈ సినిమాకు. లాంగ్ రన్ లో రూ.350 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి తెలుగు సినిమా స్థాయిని పెంచింది.

ఇక ఈ సినిమాకు సీక్వల్ గా పుష్ప2(పుష్ప ది రూల్) వస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. పార్ట్ 1భారీ విజయాన్ని సాధించిన నేపధ్యంలో పుష్ప పార్ట్ 2పై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ఇదిలా ఉంటే.. కొంతకాలంగా పుష్ప 2కి మరో సీక్వెల్ గా పుష్ప 3 కూడా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలపై మేకర్స్ ఇప్పటివరకు అధికారికంగా ప్రకటన ఇవ్వలేదు. దీంతో ఇవన్నీ రూమర్స్ అనుకున్నారు ఆడియన్స్. 

అయితే తాజాగా పుష్ప పార్ట్ 3పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు అల్లు అర్జున్. ఇటీవల ఆయన జర్మనీలో జరుగుతున్న బెర్లిన్ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో పాల్గొన్నారు. ఆ ఈవెంట్ లో పుష్ప సినిమాను ప్రదర్శించారు నిర్వాహకులు. అనంతరం జర్మన్ మీడియాతో మాట్లాడిన అల్లు అర్జున్.. తెలుగు సినిమా స్థాయి, తెలుగు సినిమా వైభవం గురించి చెప్పుకొచ్చారు. ఇక అక్కడి రిపోర్టర్స్ పుష్ప పార్ట్3 గురించి ప్రశ్నించగా.. అన్ని అనుకున్నట్లుగా కుదిరితే పుష్ప 3 కూడా ఉంటుంది. అంతేకాదు పుష్ప సినిమాను ఒక ఫ్రాంచైజ్ లా చేయాలనే ఆలోచన కూడా ఉందని చెప్పుకొచ్చాడు బన్నీ. బన్నీ చేసిన కామెంట్స్ తో ఆయన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.