Bhamakalapam 2 Review: OTTకి వచ్చిన భామా కలాపం 2.. ఈ హీస్ట్ థ్రిల్లర్ ఎలా ఉందంటే!

Bhamakalapam 2 Review: OTTకి వచ్చిన భామా కలాపం 2.. ఈ హీస్ట్ థ్రిల్లర్ ఎలా ఉందంటే!

సౌత్ బ్యూటీ ప్రియమణి(Priyamani) నటించిన లేటెస్ట్ హీస్ట్ థ్రిల్లర్ భామా కలాపం 2(Bhamakalapam 2). 2022లో వచ్చిన భామా కలాపం సినిమాకు ఇది సీక్వెల్. అభిమన్యు తడిమేటి తెరకెక్కించిన ఈ మూవీపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. మొదటి పార్ట్ మంచి విజయాన్ని సాధించిన నేపధ్యంలో పార్ట్ 2 కోసం ఆడియన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. వారి ఎదురుచూపులు ఎండ్ కార్డు వేస్తూ భామా కలాపం 2 మూవీ ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో ఫిబ్రవరి 16 నుండి అందుబాటులోకి వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ఆడియన్స్ ను ఏమేరకు ఆకట్టుకుంది? అనేది ఈ రివ్యూలో తెలుసుకుందాం. 

కథ:
అనుపమ(ప్రియమణి) ఒక సాధారణ గృహిణి. పార్ట్ 1లో జరిగిన కొన్ని సంఘటనల కారణంగా భర్త, కొడుకుతో వేరే అపార్ట్మెంట్ కు షిఫ్ట్ అవుతుంది. తన యూట్యూబ్ ఛానెల్ తో వచ్చిన మనీతో పనిమనిషి శిల్ప(శరణ్య ప్రదీప్)తో కలిసి ఒక హోటల్ పెడుతుంది. అదే సమయంలో నగరంలో ఒక కుకింగ్ కాంపిటీషన్ అనౌన్స్మెంట్ వస్తుంది. ఆ కాంపిటీషన్ నడిపే వ్యక్తి ఆంటోనీ లోబో(అనుజ్ గుర్వార) ఒక డ్రాగ్ డీలర్. ఈ కాంపిటీషన్ బేస్ చేసుకొని భారీగా డ్రాగ్ డీల్ చేయాలనీ ప్లాన్ చేస్తాడు. ఆ కాంపిటీషన్ కు అనుపమ, శిల్ప సెలెక్ట్ అవుతారు. ఆతరువాత ఎం జరిగింది? ఆ డ్రాగ్ డీలింగ్ లోకి అనుపమ,శిల్ప ఎలా ఎంటర్ అయ్యారు?వారితో నార్కోటిక్స్ బ్యూరో ఆఫీసర్ కి లింక్ ఏంటి? చివరికి ఎం జరిగింది? అనేది మిగిలిన కథ. 

విశ్లేషణ:
థ్రిల్లర్ సినిమాలకు ముఖ్యంగా కావాల్సింది కథనం. అది ఎంత బాగుంటే ఆడియన్స్ అంతలా కనెక్ట్ అవుతారు. భామ కలాపం పార్ట్ 1లో వాటిని చాలా చక్కగా డీల్ చేసిన దర్శకుడు పార్ట్ 2 కోసం కూడా అదే పంధాను ఎంచుకున్నాడు. కథ మొదలవడంతోనే మంచి ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేసిన దర్శకుడు.. దాన్ని ముందుకు సాగించిన విధానం కూడా బాగుంది. ఆ క్రమంలో వచ్చే ట్విస్టులు కూడా పరవాలేదు అనిపిస్తుంది.

ఇక ప్రీ క్లిమక్స్ లో వచ్చే హీస్ట్ సీన్స్ సినిమాను నిలబెడతాయి. కానీ, ఆ సీన్స్ ను ఇంకాస్త బలంగా, ఉత్కంఠగా రాసుకుంటే బాగుండేది అనిపిస్తుంది. ఎదో జరుగుతుంది అంటే జరుగుతుంది అనేలా ఉంటాయి పెద్దగా మెస్మరైజ్ అయ్యేంతల ఉండవు. చూడొచ్చు. ఇక క్లిమక్స్ లో ప్రియమణి ఇచ్చే ట్విస్ట్ కూడా పరవాలేదు అనిపిస్తుంది. సినిమా చివర్లో పార్ట్ 3 కోసం ఇచ్చిన లీడ్ కూడా బాగుంది. 

నటీనటులు:
ఈ సినిమాలో హైలెట్ అంటే ప్రియమణి అనే చెప్పాలి. ఓపక్క భర్తకు భయపడే భార్యగా ఉంటూనే.. తనమీదకి వచ్చినప్పుడు ఎంతకైనా తెగించే మహిళగా ఆకట్టుకుంటుంది. ఓపక్క టెన్షన్ పడుతూ. మరోపక్క ఎవరికీ తెలియకుండా సరికొత్త ప్లాన్స్ వేస్తూ పోలీసులకే షాకిస్తుంది. ఇక శిల్పగా శరణ్య ప్రదీప్ కూడా బాగా నటించింది. అమాయకత్వమైన నటన, తనదైన కామెడీతో మెప్పించింది. ఇక సీరత్ కపూర్ కూడా గ్లామర్ తో ఆకట్టుకుంది. మిగిలిన వారు కూడా తమ పాత్ర మేరకు ఆకట్టుకుంటారు. 

 సాంకేతిక నిపుణులు:
భామా కలాపం2 సినిమాకు ప్రధాన బలం అంటే ప్రశాంత్ ఆర్ విహారి అందించిన నేపధ్య సంగీతం అనే చెప్పాలి. సినిమా మూడ్ కి తగ్గట్టు ఇచ్చిన మ్యూజిక్ సీన్స్ ను బాగా ఎలివేట్ చేసింది. మరీ ముఖ్యంగా క్లిమక్స్ లో వచ్చే బీజేఎం చాలా బాగుంది. ఇక దీపక్ యరగేర కెమెరా వర్క్, విప్లవ్ నైషదం ఎడిటింగ్ కూడా పర్ఫెక్ట్ గా కుదిరాయి. ఇక దర్శకుడు  అభిమన్యు తడిమేటి తాను ఎంచుకున్న సింపుల్ కథని ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా నీట్ గా ప్రెజెంట్ చేశాడు. కథలో ఆడియన్స్ ఇన్వాల్వ్ అయ్యేలా చేయడంలో సక్సెస్ అయ్యాడు.

ఇక భామా కలాపం 2 సినిమా గురించి ఒక్కముక్కలో చెప్పాలంటే.. అంచనాలు లేకుండా చూస్తే ఆకట్టుకుంటుంది.