విశ్వక్ సేన్ .. మెకానిక్ రాకీ మూవీ నుంచి ఫస్ట్ గ్లింప్స్‌‌‌‌ రిలీజ్

విశ్వక్ సేన్ .. మెకానిక్ రాకీ  మూవీ నుంచి ఫస్ట్ గ్లింప్స్‌‌‌‌ రిలీజ్

విశ్వక్ సేన్ హీరోగా రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న  చిత్రం ‘మెకానిక్ రాకీ’. మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్స్.  ఆదివారం ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్‌‌‌‌ను రిలీజ్ చేశారు. ఇందులో విశ్వక్ సేన్, మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ లుక్స్‌‌‌‌ను రివీల్ చేశారు. యాక్షన్, ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌మెంట్, కామెడీతో  సాగిన గ్లింప్స్ ఆకట్టుకుంది. ‘డేంజర్‌‌‌‌‌‌‌‌కే లైసెన్సు వీడు’ అనే డైలాగ్‌‌‌‌తో పాటు జేక్స్ బిజోయ్ అందించిన బ్యాక్‌‌‌‌గ్రౌండ్ స్కోరు హైలైట్‌‌‌‌గా నిలిచింది.

 ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌‌‌‌మీట్‌‌‌‌లో విశ్వక్ సేన్ మాట్లాడుతూ ‘ఇదొక బ్యూటీఫుల్ ట్రైయాంగిల్ లవ్ స్టోరీ. మలక్‌‌‌‌పేట్ బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌లో సాగుతుంది.   మంచి కామెడీ టైమింగ్‌‌‌‌తో నా క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌ చాలా కనెక్టింగ్‌‌‌‌గా ఉంటుంది. మీనాక్షికి గుర్తుండిపోయే క్యారెక్టర్ అవుతుంది. శ్రద్ధా శ్రీనాథ్ స్టైలిష్ లుక్‌‌‌‌లో కనిపించనుంది. జేక్స్ బిజోయ్ అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చాడు. ప్రతి సాంగ్ బ్లాక్ బస్టర్ అయ్యే ఆల్బమ్ ఇచ్చాడు. 

ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారు. ఇది దివాళి క్రాకర్ అవుతుంది’ అని చెప్పాడు. ఇందులో తను చేస్తున్న క్యారెక్టర్ చాలా రిలేటబుల్‌‌‌‌గా ఉంటుందని మీనాక్షి చౌదరి చెప్పింది. ఇదొక మంచి మాస్ ఫ్యామిలీ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్ అని దర్శక నిర్మాతలు అన్నారు. సునీల్, నరేష్​, వైవా హర్ష ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ  చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదల కానుంది.