Vishwak Sen As Laila: లైలా పాత్రలో విశ్వక్ సేన్.. కెరీర్లో మొదటిసారి లేడీ రోల్

Vishwak Sen As Laila: లైలా పాత్రలో విశ్వక్ సేన్.. కెరీర్లో మొదటిసారి లేడీ రోల్

టాలీవుడ్ మాస్ కా దాస్  విశ్వక్ సేన్(Vishwak sen) ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ జోష్ లో ఉన్నారు. మార్చి 29 అయన పుట్టినరోజు సందర్బంగా మరో రెండు సినిమాలను మొదలుపెట్టారు. అందులో ఒకటి మెకానిక్ రాకీ(Mechanic Rocky) కాగా.. రెండోవది లైలా(Laila). ఈ రెండు సినిమాల్లో లైలా సినిమా గురించి  సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. కారణం.. కెరీర్ లో మొదటిసారి ఈ సినిమా కోసం లేడీ రోల్ లో కనిపించనున్నాడు విశ్వక్. అందుకే ఆడియన్స్ లో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. 

తాజాగా ఈ సినిమా టైటిల్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. షైన్ స్క్రీన్ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమాను రామ్ నారాయణ్ తెరకెక్కిస్తున్నారు. ఈ టైటిల్ వీడియోలో లైలా ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు. లేడీస్ యూజ్ చేసే అడ్డం, లిప్ స్టిక్, ఐ లైనర్, మేకప్ కిట్, ఫ్లవర్స్ వంటి వాటిని చూపిస్తూ ఈ సినిమా కోసం పనిచేస్తున్న టెక్నీషియన్స్ ను పరిచయం చేశారు. 

అయితే టైటిల్ పోస్టర్ ను క్లియర్ గా గమనిస్తే.. అందులో తాళిబొట్టు, కత్తి, మేక తల కూడా ఉన్నాయి. కాబట్టి.. ఈ సినిమా ఒక రివెంజ్ డ్రామాగా రానుందని కథలు అల్లేస్తున్నారు నెటిజన్స్. మరి అదే గనక నిజమైతే విశ్వక్ సేన్ నుండి మరో క్రేజీ ఫిలిం రావడం ఖాయం అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక లైలా సినిమాకు బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ తనిష్క్ బగ్ఛీ సంగీతం అందిస్తున్నారు. మరి సరికొత్త కాన్సెప్ట్ తో, సరికొత్త అవాతారంలో వస్తున్న విశ్వక్ ఈ సినిమాతో ఆడియన్స్ ను ఏమేరకు ఆకట్టుకుంటాడో చూడాలి.