హైదరాబాద్, వెలుగు: నిర్మాణ రంగానికి అందించిన విశిష్ట సేవలకు గాను సోమా శ్రీనివాస్ రెడ్డి ఇంజనీర్స్ అండ్ కాంట్రాక్టర్స్(ఎస్ఎస్ఆర్ఈసీ)కు నీతి ఆయోగ్ స్థాపించిన కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ డెవెలప్మెంట్ కౌన్సిల్(సీఐడీసీ) విశ్వకర్మ అవార్డును 2023 సంవత్సరానికి గానూ ప్రదానం చేసింది.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్తో కుదిరిన ఒప్పందంలో భాగంగా, భవన నిర్మాణ వ్యర్థాల సేకరణ, తరలింపు ప్రక్రియలో పర్యావరణ అనుకూల పద్ధతులను పాటించినందుకు ‘అచీవ్మెంట్అవార్డ్ ఫర్ సస్టైనబుల్ మెటీరియల్స్/ప్రాక్టీసెస్’ విభాగంలో ఈ అవార్డు దక్కింది. ఢిల్లీలో ఈ నెల నాలుగో తేదీన జరిగిన కార్యక్రమంలో ప్రాజెక్ట్ డైరెక్టర్ బి.రఘురామ్అవార్డును అందుకున్నారు. సంస్థ ఉద్యోగుల కృషి, సమష్టి భాగస్వామ్యంతో ఈ అవార్డు దక్కిందని ఎస్ఎస్ఆర్ఈసీ తెలిపింది.