దృష్టంతా ఐపీఎల్ పైనే

దృష్టంతా ఐపీఎల్ పైనే

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 12వ సీజన్‌ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఆదివారం జరిగే కోల్‌‌కతా నైట్‌ రైడర్స్‌ తో జరిగే మ్యాచ్‌తో ఈ టోర్నీని సన్‌ రైజర్స్‌ ప్రారంభించనుంది. అయితే అందరి దృష్టి ఈ మ్యాచ్‌ పైనే నెలకొని ఉంది. దాదాపు ఏడాది నిషేధం తర్వాత ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ ఐపీఎల్లో బరిలోకి దిగుతున్నాడు. 2017 సీజన్‌ లో భీకరఫామ్‌ తో జట్టు ను ప్లే ఆఫ్స్‌ కు చేర్చిన వార్నర్.. అంతకుముందు సీజన్‌ లో ఏకంగా జట్టు ను విజేతగా నిలిపాడు. మరోవైపు నిరుటి సీజన్‌ లో వార్నర్‌ లేకున్నారన్నరప్‌ గా నిలిచిన సన్‌ రైజర్స్‌ .. ఈసారి అతని రాకతో రెండో టైటిల్‌‌పై దృష్టి సారించిం ది. ఈక్రమంలో ప్రస్తుతం తన దృష్టంతా సన్‌ రైజర్స్‌ తరఫున ఆడడంపైనే నెలకొందని వార్నర్‌ స్పష్టం చేశాడు. తననుంచి వీలైనంత సహకారాన్ని జట్టు కు అందిస్తానని పేర్కొంటున్నాడు. ఫెంటాస్టిక్‌ ఫ్యాన్స్‌ సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ ఫ్యాన్ స్‌ పై వార్నర్‌పొగడ్తల వర్షం కురిపించాడు. ఏడాది తర్వాత జట్టు లోకి చేరిన తనకు అపూర్వ స్వాగతం అందించారని పేర్కొన్నాడు.తనకు ప్రస్తుతం ఇంట్లో ఉన్నట్లు ఉందని, తన శ్రేయస్సు కోరుతూ చాలామంది మెసేజ్ లు పంపారని గుర్తుచేసుకున్నాడు. మరోవైపు టీమ్‌ మెం టార్‌ లక్ష్మణ్‌ చాలా హంబుల్‌‌గా ఉంటారని, తనతో పనిచేయడం చాలా ఆనందంగా ఉందని వ్యాఖ్యానించాడు. తనను సన్‌ రైజర్స్‌ ఫ్యామిలీలో భాగంగా భావిస్తున్నారని, అందుకే తనకు ఇంతటి అపూర్వ స్వాగతం లభించిందని మురిసిపోతున్నాడు. తాజా పరిణామాలపై తను చాలా ఆనందంగా ఉన్నానని, వీలైనంత త్వరగా తన పనిలోకి దిగుతానని పేర్కొన్నాడు.

ప్రపంచకప్‌ గురించి ఆలోచించడం లేదు…

ప్రస్తుతం తన దృష్టంతా ఐపీఎల్‌‌పైనే నిలిచిందన వార్నర్‌ పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా జాతీయజట్టు తరఫున వచ్చే ప్రపంచకప్‌ లో ఆడతానో లేదోనని ఆలోచించడం లేదని తెలిపాడు. నిజానికి తను కూడా జట్టు సెలెక్షన్‌ కోసం ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నాడు. ఐపీఎల్‌‌లో ప్రదర్శన ద్వారా ప్రపంచకప్‌ బెర్త్‌‌ సాధించాలని భావించడం లేదని, సన్‌ రైజర్స్‌ తరఫున మెరుగైన ప్రదర్శన చేయాలని ఆశిస్తున్నట్లు తెలిపాడు. ఒకవేళ తను మెగాటోర్నీకి ఎంపికైతే పరిమిత ఓవర్ల క్రికెట్‌ లోకి ఘనమైన పునరాగమనం చేసినట్లు అవుతుందని పేర్కొన్నాడు. జట్టు కోసం పూర్తి స్థా యి ప్రదర్శన ఇవ్వడంపైనే దృష్టం తా ఉందని పేర్కొంటున్నాడు.