ఎంఎస్‌‌‌‌ఎంఈలకు రూ.700 కోట్ల రిఫండ్‌‌‌‌

ఎంఎస్‌‌‌‌ఎంఈలకు రూ.700  కోట్ల రిఫండ్‌‌‌‌

న్యూఢిల్లీ: కరోనా టైమ్‌‌‌‌లో నష్టపోయిన ఎంఎస్‌‌‌‌ఎంఈలను ఆదుకునేందుకు తెచ్చిన వివాద్‌‌‌‌  సే విశ్వాస్‌‌‌‌ – 1 స్కీమ్ మంచి ఫలితాలను ఇస్తోంది. ప్రభుత్వం ఈ స్కీమ్‌‌‌‌ కింద ఇప్పటి వరకు   43,904  రిఫండ్ క్లయిమ్స్‌‌‌‌ను సెటిల్ చేసింది. మొత్తం రూ.700 కోట్లను ఎంఎస్ఎంఈలకు  ఇచ్చింది. ఈ స్కీమ్ కింద  ఎంఎస్‌‌‌‌ఎంఈలు, ప్రభుత్వ సంస్థల మధ్య ఏర్పడిన కాంట్రాక్చువల్‌‌‌‌ వివాదాలను పరిష్కరిస్తున్నారు.

ఎంఎస్‌‌‌‌ఎంఈల  పెర్ఫార్మెన్స్ లేదా బిడ్ సెక్యూరిటీ (బిడ్డర్ చెల్లించే సెక్యూరిటీ అమౌంట్‌‌‌‌) లో 95 శాతాన్ని రిఫండ్‌‌‌‌ చేస్తున్నారు. అంతేకాకుండా కరోనా సంక్షోభం టైమ్‌‌‌‌లో ప్రభుత్వ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌లు,  సంస్థల వలన జరిగిన నష్టాలను రిఫండ్ చేసుకోవచ్చు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని బడ్జెట్‌‌‌‌లో ఈ స్కీమ్‌‌‌‌ను ప్రకటించారు. ఈ ఏడాది ఏప్రిల్‌‌‌‌ 17 న ఈ స్కీమ్‌ 1 ఓపెన్ అయ్యింది.