కేసీఆర్ రాక్షస, నియంతృత్వ పాలనకు అంతం పలకాలని బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో కలిసి కేంద్ర మంత్రి అమిత్ షాను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో రాజగోపాల్ కీలక పాత్ర పోషించారని, మునుగోడు నియోజకవర్గంలో పాపుల్ లీడర్ అని వివేక్ చెప్పారు. కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా మరో ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందని ఏడాదిన్నర క్రితమే చెప్పారని ఇప్పటికైనా బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నందుకు రాజగోపాల్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల కోసం మంచి నిర్ణయం తీసుకున్నారని అమిత్ షా సైతం రాజగోపాల్ రెడ్డిని అభినందించినట్లు చెప్పారు.
రాష్ట్రా్న్ని అప్పులకుప్పగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ను తెలంగాణ రాజపక్సగా అభివర్ణించిన ఆయన.. పరిస్థితి ఇలాగే కొనసాగితే శ్రీలంకకు పట్టిన గతే రాష్ట్రానికి పడుతుందని అన్నారు. లక్ష కోట్లు ఖర్చుపెట్టి కాళేశ్వరం కట్టినా చుక్క నీరు అందడంలేదని మండిపడ్డారు.