నాగరాజు కుటుంబానికి అండగా ఉంటాం

నాగరాజు కుటుంబానికి అండగా ఉంటాం

రాష్ట్రంలో శాంతి భద్రతల లోపం వల్లే నాగరాజు హత్యకు గురయ్యాడని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకట స్వామి ఆరోపించారు. సరూర్ నగర్ లో పరువు హత్యకు గురైన నాగరాజు కుటుంబసభ్యులను జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ విజయ్ సంప్లతో కలిసి పరామర్శించారు. వికారాబాద్ జిల్లా మర్పల్లి గ్రామానికి చేరుకున్న నేతలు.. నాగరాజు కుటుంసభ్యులను ఓదార్చారు. పరువు హత్యలను నివారించడానికి దేశంలో కొత్త చట్టం తీసుకొచ్చేలా మోడీని కోరతామని వివేక్ వెంకట స్వామి చెప్పారు. బాధిత కుటుంబానికి ఎస్సీ కమిషన్ అండగా ఉంటుందని విజయ్ సంప్ల భరోసానిచ్చారు. 

మరిన్ని వార్తల కోసం

ఆర్టీసీ బస్సులో సీఎం స్టాలిన్ 

ధాన్యం లెక్కలు చూపని మిల్లుల నుంచి రైస్ తీసుకోం