బాల్క సుమన్ అధికార దుర్వినియోగం.. డోర్లు వేసి పోలింగ్ జరుపుతుర్రు: వివేక్

బాల్క సుమన్ అధికార దుర్వినియోగం.. డోర్లు వేసి పోలింగ్ జరుపుతుర్రు: వివేక్

అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండగా.. చెన్నూరు నియోజకవర్గంలో అడుగడుగున అధికార దుర్వినియోగం జరుగుతోందని కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి ఆరోపిస్తున్నారు. ఎన్నికల అధికారులు, పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు.  అభ్యర్థి ఏజెంట్ ని అడ్డుకొని డోర్లు వేసి పోలింగ్ జరిపిస్తున్నారని ఆరోపించారు.  

పోలింగ్ కేంద్రంలోకి బాల్క సుమాన్ అనుచరులు అడ్డుగోలుగా దూసుకెళ్తున్నారని... క్యూలైన్లలో ప్రచారం చేస్తున్న అధికారులు పట్టించుకోకవడాన్ని వివేక్ తప్పుపట్టారు. ఓటర్లను భయపెట్టేలా బాల్క సుమన్, బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ప్రవర్తిస్తున్నారన్నారు. అధికారులు, పోలీసులపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు. చివరగా బాల్క సుమన్ అధికారాన్ని అడ్డుపెట్టుకుని  గుండాయిజంతో ఓటర్లను బెదిరించేందుకు కుట్రలు చేస్తున్నారని వివేక్ ఆరోపించారు.