ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

మందమర్రి, వెలుగు: మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీ ఆర్కేపీ కోదండరామాలయంలో ఆదివారం రాత్రి అయ్యప్ప స్వామి పడిపూజ వైభవంగా నిర్వహించారు. ఈ పడిపూజలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీ వివేక్​ వెంకటస్వామి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. గురుస్వామలు గడ్డం రమేశ్​, రంగాచారి, నల్లగొండ నర్సింహం, ఆలయ పూజారి అంబప్రసాద్​వివేక్​ వెంకటస్వామికి ఆశీర్వచనాలు అందించారు.కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రెసిడెంట్​ రఘునాథ్​ వెరబెల్లి, జిల్లా జనరల్​సెక్రటరీ శ్రీనివాస్​, రామకృష్ణాపూర్​ టౌన్​ ప్రెసిడెంట్​ శ్రీనివాస్​, నియోజకవర్గ కన్వీనర్​ రమేశ్​, జైపూర్​ మండల ప్రెసిడెంట్​ విశ్వంభర్​రెడ్డి, లీడర్లు పాల్గొన్నారు. అనంతరం క్యాతనపల్లి ఎంఎన్​ఆర్​ గార్డెన్స్​లో సింగరేణి అధికారి  జక్కారెడ్డి  కూతురు ఎంగేజ్​మెంట్​ వివేక్​ వెంకటస్వామి హాజరయ్యారు. 

మాజీ జడ్పీటీసీ కుటుంబానికి పరామర్శ 

రామకృష్ణాపూర్​ పట్టణం ఆర్కే–1 మార్కెట్​కు చెందిన టీఆర్ఎస్​ లీడర్, మాజీ జడ్పీటీసీ కంబగోని సుదర్శన్​గౌడ్​ కుటుంబాన్ని వివేక్​ వెంకటస్వామి పరామర్శించారు. ఇటీవల సుదర్శన్​గౌడ్​ సోదరుడు ఆనంద్​ అనారోగ్యంతో చనిపోయారు. విషయం తెలుసుకున్న వివేక్​ వెంకటస్వామి ఆయన కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. 

ఆలయాల అభివృద్ధికి కృషి

భైంసా, వెలుగు: భైంసా డివిజన్​ పరిధిలోని ఆయా గ్రామాల్లో ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వ కృషి చేస్తోందని ముథోల్​ఎమ్మెల్యే విఠల్ రెడ్డి తెలిపారు. ఆదివారం భైంసా పట్టణంలోని సంతోషిమాత ఆలయంలో రూ.10 లక్షలతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాధాన్యక్రమంలో ఆలయాల్లో వసతులు, సౌకర్యాలు పెంపునకు చర్యలు చేపడుతున్నామన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తామన్నారు. కార్యక్రమంలో భైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పిప్పర కృష్ణ, మున్సిపల్ కౌన్సిలర్లు చందులాల్, తోట విజయ్, బీఆర్ఎస్​లీడర్లు మురళిగౌడ్, రాము, సూర్యనారాయణ, ఆలయ కమిటీ చైర్మన్​మోహన్ పాల్గొన్నారు.

స్పీడ్‌గా పూర్తి చేయాలి 

లోకేశ్వరం, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘మన ఊరు–మనబడి’లో భాగంగా చేపట్టిన పనులను స్పీడ్‌గా పూర్తి చేయాలని ఎమ్మెల్యే విఠల్​రెడ్డి అన్నారు. ఆదివారం లోకేశ్వరం మండలం హవర్గా, సాదుగాం, లోకేశ్వరం, గడుచందా, జోహార్ పూర్ గ్రామాలలో పనులను ఆయన పరిశీలించారు. హద్గాంలో రూ.42 లక్షలతో కల్యాణ మండపానికి భూమి పూజ చేశారు. లోకేశ్వరం హైస్కూల్​లో మన ఊరి–మన బడి పనులను పరిశీలించారు. కార్యక్రమంలో పీఏసీఎస్​చైర్మన్ రత్నాకర్ రావు, టీఆర్ఎస్ మండల కన్వీనర్ శ్యాంసుందర్, జడ్పీ  మాజీ చైర్మన్ శ్యాంసుందర్, ఆయా గ్రామాల సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.

బెల్లంపల్లిలో నేషనల్ లెవల్ కరాటే చాంపియన్ షిప్

బెల్లంపల్లి, వెలుగు: బెల్లంపల్లి పట్టణంలోని టీసీఓఏ క్లబ్‌లో నేషనల్ లెవల్ ఓపెన్ కరాటే చాంపియన్ షిప్ పోటీలు–2022ను సీబీసీఐడీ రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ రవికుమార్,  తాండూర్ సీఐ జగదీశ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరాటేకు నేడు ప్రపంచ స్థాయి గుర్తింపు ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నుంచి నైపుణ్యం ఉన్న క్రీడాకారులు వస్తున్నారన్నారు. బెల్లంపల్లి లో నేషనల్​లెవల్​కరాటే పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ పోటీల్లో ఢిల్లీ , మహారాష్ట్ర , తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక.. రాష్ట్రాలకు చెందిన 500 మంది క్రీడాకారులు హాజరయ్యారు. కార్యక్రమంలో టోర్నమెంట్ చీఫ్​ఆర్గనైజర్ ఎనగందుల వెంకటేశ్, జిల్లా ఆల్ స్టైల్స్  కరాటే అసోసియేషన్ అధ్యక్షుడు మోహన్, చీఫ్ రెఫరీలు, మాస్టర్లు మల్లికార్జున్ గౌడ్, పి. శ్రీనివాస్, సారయ్య, ముఖేశ్, సురేశ్, ఓరం రాజేశ్, జితేందర్, బలరాం, భూమయ్య, రవి, ఎ.రాజేషం పాల్గొన్నారు.

కామన్ స్కూల్ విధానంతోనే అందరికీ విద్య  

  • యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవి 

ఆదిలాబాద్​, వెలుగు: కామన్ స్కూల్ విధానంతోనే అందరికీ సమాన, నాణ్యమైన విద్య సాధ్యమవుతుందని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావా రవి అన్నారు. ఆదివారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో టీఎస్ యూటీఎఫ్ జిల్లా మహాసభలు జరిగాయి. చీఫ్​గెస్ట్​గా హాజరైన ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడంతోపాటు విద్యా వ్యాపారీకరణను అడ్డుకోవాలన్నారు. దీంతోపాటు ఉపాధ్యాయుల హక్కులను కాపాడుకోవాల్సిన అవసరముందన్నారు. ప్రభుత్వ విద్యావిధానంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలను సరిగా లేవన్నారు. అనంతరం టీఎస్​ యూటీఎఫ్​ జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. కార్యక్రమంలో డీఈవో  టి.ప్రణీత , టీఎస్​యూటీఎఫ్​  రాష్ట్ర కార్యదర్శి ఎ. వెంకట్, లక్ష్మణ్, ఆల్ పెన్షనర్  అసోసియేషన్ అధ్యక్షుడు శశికాంత్, లీడర్లు శ్రీనివాస్, అశోక్,  సురేఖ, స్వామి పాల్గొన్నారు.

మంచిర్యాల జిల్లా కమిటీ ఎన్నిక

మంచిర్యాల, వెలుగు: టీఎస్ యూటీఎఫ్ జిల్లా కమిటీని ఆదివారం మంచిర్యాలలో జరిగిన 4వ మహాసభలో ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా గొల్ల రామన్న, ప్రధాన కార్యదర్శిగా గుర్రాల రాజావేణు,ఉపాధ్యక్షులు జి.చక్రపాణి, ఎస్.లావణ్య, ట్రెజరర్​గా కిరణ్, కార్యదర్శులుగా కె.చంద్రమౌళి, జి.నర్సయ్య, ఎ.సంతోష్ కుమార్, వి.కిరణ్, ఎస్.బబిత, సుమన, అయూబ్ ఖాన్, దేవిదాస్ ఎన్నికయ్యారు.