కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసిన వివేక్ వెంకటస్వామి

కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసిన వివేక్ వెంకటస్వామి

కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ను  బీజేపీ  జాతీయ కోర్ కమిటీ సభ్యులు వివేక్ వెంకటస్వామి కలిశారు.   పెద్దపల్లిలోని  ఓదేల  మండలంలో పుష్ పుల్  రైల్, రామగిరి రైలును  ఆగేలా చూడాలని  మంత్రికి వినతి పత్రం అందజేశారు.  దీంతో పాటు మంచిర్యాలలో ఫోటో బిజీ ఏర్పాటు చేయాలంటూ, దాని పనులు వేగవంతం చేయాలంటూ కోరారు.  మంచిర్యాలలో ఒక సూపర్ ఫాస్ట్  ఎక్స్  ప్రెస్ స్టాప్ కి  కేంద్రమంత్రి అశ్విన్ వైష్ణవ్ అనుమతిచ్చారని వివేక్ వెంకటస్వామి తెలిపారు.  త్వరలోనే అన్ని పనులు పూర్తి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారని చెప్పారు.