తాడిచర్ల మైన్స్ అవినీతిపై సీబీఐ విచారణ జరపాలి: వివేక్ వెంకటస్వామి

తాడిచర్ల మైన్స్ అవినీతిపై సీబీఐ విచారణ జరపాలి: వివేక్ వెంకటస్వామి

మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి కౌంటర్ ఇచ్చారు. కోల్ మైన్ బ్లాక్స్ గురించి మంత్రి కేటీఆర్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. కమీషన్ల కోసమే తాడిచర్ల మైన్స్ ను కేసీఆర్ ప్రభుత్వం ఏఎమ్ఆర్ కు అప్పగించిందని ఆరోపించారు. ఈ మైన్ లో రూ.20 వేల కోట్ల కుంభకోణం జరిగిందన్నారు.  దీని వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి రూ.20వేల కోట్లు నష్టం వాటిల్లిందన్నారు. తాడిచర్ల మైన్స్ లో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు.  సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారమే రాజగోపాల్  రెడ్డి కాంట్రాక్టు టెండర్స్  దక్కించుకున్నారని  అన్నారు. మునుగోడులో ఓటమి భయంతోనే రాజగోపాల్ రెడ్డిపై కేటీఆర్ తప్పడు ఆరోపణలు చేస్తున్నాడని విమర్శించారు. 

ప్రత్యేక అధికారుల  పర్యవేక్షణలో ఉప ఎన్నికను జరపాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరామని వివేక్ వెంకటస్వామి అన్నారు. మునుగోడులో టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందన్నారు.  కేసీఆర్, కేటీఆర్ లకు గుణపాఠం చెప్పటానికి మునుగోడు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. సొంత కార్యకర్తలను కొనుగోలు చేయాల్సిన  దుస్థిలో టీఆర్ఎస్ ఉందన్నారు.  రాజగోపాల్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి తరుణ్ చుగ్ బండి సంజయ్ , ముఖ్య నేతలు హాజరవుతారన్నారు.