కాంట్రాక్ట్​ కార్మికులను కేసీఆర్​ నమ్మించి మోసం చేశాడు

కాంట్రాక్ట్​ కార్మికులను కేసీఆర్​ నమ్మించి మోసం చేశాడు
  • బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్​ వెంకటస్వామి

మందమర్రి, వెలుగు: రాష్ట్రం ఏర్పడితే కాంట్రాక్ట్​ కార్మికులను పర్మినెంట్ ​చేస్తామన్న సీఎం కేసీఆర్​ గెలిచిన తర్వాత పట్టించుకోవడం లేదని, వెంటనే రెగ్యులర్​చేయాలని మాజీ ఎంపీ, బీజేపీ నేషనల్​ ఎగ్జిక్యూటివ్​ మెంబర్​ వివేక్ ​వెంకటస్వామి డిమాండ్​ చేశారు. న్యాయమైన డిమాండ్ల సాధన కోసం సింగరేణి కాంట్రాక్ట్​ కార్మికులు శుక్రవారం నుంచి సింగరేణిలో చేపట్టిన నిరవధిక సమ్మెకు ఆయన సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

ఈ సందర్భంగా వివేక్ ​వెంకటస్వామి మాట్లాడుతూ.. సింగరేణి వ్యాప్తంగా 40 వేల మంది కాంట్రాక్ట్​ కార్మికులు సమ్మె చేస్తున్నారని, వారి డిమాండ్లను పరిష్కారించాలని డిమాండ్​ చేశారు. కార్మికులను నాలుగో తరగతి ఉద్యోగులుగా రాష్ట్ర సర్కార్​ పరిగణించాలని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడేటప్పుడు వీరంతా సకలజనుల సమ్మెలో పాల్గొన్నట్లు చెప్పారు. సమ్మెలో పాల్గొన్న సింగరేణి పర్మినెంటు కార్మికులకు ప్రత్యేకంగా సకలజనుల సమ్మె వేతనాలు ఇచ్చి కాంట్రాక్ట్ ​కార్మికులను విస్మరించారన్నారు. తెలంగాణ వస్తే కాంట్రాక్ట్​ కార్మికులను పర్మినెంట్​ చేస్తానని కేసీఆర్​ నమ్మించి మోసం చేశాడన్నారు. కార్మికుల సమస్యను కేంద్ర బొగ్గు గనుల శాఖ, కార్మికశాఖ మంత్రుల దృష్టికి తీసుకవెళ్లనునట్లు చెప్పారు. సుప్రీం కోర్టు తీర్పును అనుసరించి సింగరేణి యాజమాన్యం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్​ చేశారు. సింగరేణి కాంట్రాక్టు కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మెకు పలు కార్మిక సంఘాల నాయకులు ముల్మూరి శ్రీనివాస్, రామగిరి నాగరాజు, ఆకుల వెంకన్న, అరవింద్, వై.వి రావు, బుర్ర తిరుపతి, సతీశ్​మద్దతు తెలిపారు.