మంచిర్యాలలో రైల్వే గేట్​ను తెరిపించండి : వివేక్ వెంకటస్వామి

మంచిర్యాలలో రైల్వే గేట్​ను తెరిపించండి : వివేక్ వెంకటస్వామి
  • మంచిర్యాలలో రైల్వే గేట్​ను తెరిపించండి 
  • ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులను త్వరగా పూర్తి చేయించండి 
  • రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్​ను కోరిన వివేక్ వెంకటస్వామి

హైదరాబాద్, వెలుగు: పెద్దపల్లి జిల్లా ఓదెల స్టేషన్​లో పుష్ పుల్, రామగిరి ట్రైన్లకు హాల్టింగ్​ ఇవ్వాలని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ను బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి కోరారు. బుధవారం మంచిర్యాల బీజేపీ ఇన్ చార్జ్​ రఘునాథ్​తో కలిసి అశ్వినీ వైష్ణవ్ ను వివేక్ వెంకటస్వామి కలిశారు. మంచిర్యాల టౌన్ లో రైల్వే క్రాసింగ్ గేటును మూసేశారని.. దీనివల్ల రోజూ కార్మికులు , స్టూడెంట్స్ , వీధి వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారని మంత్రికి వివేక్ వివరించారు.

మంచిర్యాలలో 3 లక్షల జనాభా ఉందని, వారి ఇబ్బందుల దృష్ట్యా రైల్వే క్రాసింగ్ గేటును ఓపెన్ చేయించడంతో పాటు ఫుట్ ఓవర్ బ్రిడ్జిని త్వరగా పూర్తి చేయాలని కోరారు. త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటామని రైల్వే మంత్రి హామీ ఇచ్చారని వివేక్ వెంకటస్వామి తెలిపారు.  మంచిర్యాలలో కొన్ని  ట్రైన్ల స్టాప్​లు అడిగామని, స్టడీ చేసి సూపర్ ఫాస్ట్  ట్రైన్ హాల్టింగ్​ఇస్తామని రైల్వే మంత్రి హామీ ఇచ్చారన్నారు.