Vivo రెండు V30 Series స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసింది. వివరాలివిగో..

Vivo రెండు V30 Series స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసింది. వివరాలివిగో..

Vivo .. స్మార్ట్ ఫోన్  బ్రాండ్ కంపెనీ v30 సిరీస్ లో  Vivo  V30 ప్రో, Vivo  V30 రెండు కొత్త స్మార్ట్ ఫోన్లను విడుదల చేసింది. Vivo V3 స్మార్ట్ ఫోన్ మార్చి 14 నుంచి దేశవ్యాప్తంగా ఫ్లిఫ్ కార్ట్ , ఇతర రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉంటుంది. 

Vivo V30 Pro RAM, స్టోరేజ్

ఈ స్మార్ట్ ఫోన్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. 

  • 8GB RAM, 256GB  స్టోరేజ్ తో వస్తుంది దీని ధర. రూ. 41,999
  • 12GB RAM, 512GB  స్టోరేజ్ తో లభిస్తుంది దీని ధర. రూ. 46,999

Vivo V30 RAM, స్టోరేజ్ః

  • 8GB RAM, 128GB  స్టోరేజ్ తో వస్తుంది దీని ధర. రూ. 33,999
  • 8GB RAM, 256GB  స్టోరేజ్ తో వస్తుంది దీని ధర. రూ. 35,999
  • 12GB RAM, 256GB  స్టోరేజ్ తో లభిస్తుంది దీని ధర.రూ.37,999

V30 సిరీస్ లో వచ్చే ఈ రెండు స్మార్ట్ ఫోన్లు లేటెస్ట్ కెమెరా టెక్నాలజీ, అద్భుతమైన డిజైన్ లతో వస్తున్నాయని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా V30 సిరీస్ స్మార్ట్ ఫోన్లు అత్యంత సన్నగా ఉంటాయని, 2024లో పవర్ ఫుల్ 5000mAhబ్యాటరీతో లభిస్తాయి. V30 ప్రో స్మార్ట్ ఫోన్ లో దాని వెనకభాగంలోఉండే మూడు కెమెరాలతో ఫ్రొఫెషనల్ గ్రేడ్ ఇమేజింగ్ క్వాలిటీ అందిస్తుంది. రెండు స్మార్ట్ ఫోన్లు 50MP VCS  ప్రైమరీ కెమెరా ను కలిగి ఉంటాయి. ఇది స్టూడియో క్వాలిటీ ఆరా లైట్ టెక్నాలజీ ద్వారా పనిచేస్తుంది. ఫ్రంట్ , బ్యాక్ కెమెరాల ద్వారా 4K వీడియోలను రికార్డ్ చేసే సెట్టింగ్ ఉంది. 

V30 Pro స్మార్ట్ ఫోన్ Media Tech Dimensity 8200 SoC ప్రాసెసర్ తో పనిచేస్తుంది. V30  స్మార్ట్ ఫోన్ Qualcomm Snapdragon 7 Gen 3  ప్రాసెసర్ తో పనిచేస్తుంది. రెండు డివైజ్ లు Fun Touch OS14  తో రన్ అవుతాయి. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. మూడు జనరేషన్లు ఆండ్రాయిడ్ అప్డేట్స్, నాలుగు  సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్ తో పనిచేస్తుంది. 

ALSO READ :- ఏపీలో ఒంటిపూట బడులు ఆ రోజు నుంచే..

V30 ప్రో మోడల్ రెండు కలర్ వేరియంట్లలో లభ్యమవుతుంది. క్లాసిక్  బ్లాక్, అండమాన్ బ్లూ కలర్లతో లభిస్తుంది. v30 స్మార్ట్ ఫోన్ మాత్రం  మూడు రంగుల్లో లభిస్తుంది. అండమాన్ బ్లూ, పీకాక్ గ్రీన్, క్లాసిక్ బ్లాక్.