Andhra train accident : తెలంగాణ, ఏపీ మధ్య రైళ్లు రద్దు..దారి మళ్లింపు

Andhra train accident : తెలంగాణ, ఏపీ మధ్య రైళ్లు రద్దు..దారి మళ్లింపు

విజయనగరం జిల్లాలో రైలు ప్రమాదంతో పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. మరికొన్ని రైళ్లను దారి మళ్లించింది.  

రద్దైన రైళ్లు ఇవే..

  • రైలు నెంబర్ 17243 గుంటూరు టూ రాయ్ గడ్ 
  • రైలు నెంబర్ 17239 గుంటూరు టూ విశాఖపట్నం 
  • రైలు నెంబర్ 17267 కాకినాడ పోర్ట్ టూ విశాఖపట్నం 
  • రైలు నెంబర్ 17268 విశాఖపట్నం కాకినాడ పోర్ట్
  • రైలు నెంబర్ 07466 రాజమండ్రి టూ విశాఖ పట్నం 
  • రైలు నెంబర్ 07467 విశాఖపట్నం టూ రాజమండ్రి
  • రైలు నెంబర్ 12718 విజయవాడ టూ విశాఖ పట్నం
  • రైలు నెంబర్ 12717 విశాఖ పట్నం టూ విజయవాడ

Also Read :- ఏపీ రైలు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు కేంద్రం, ఏపీ ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా

దారి మళ్లించిన రైళ్లు ఇవే..

  • బరౌనీ కోయంబత్తూరు మధ్య నడిచే రైలును తిత్లిఘర్, రాంచీ, నాగ్ పూర్, బల్లార్షా, విజయవాడ మీదుగా మళ్లింపు
  • టాటానగర్ ఎర్నాకుళం రైలును గొట్లం, తిత్లినగర్, నాగ్ పూర్, బల్లార్షా, విజయవాడ మీదుగా మళ్లింపు
  • భువనేశ్వర్ ముంబై రైలును విజయనగరం, తిత్లినగర్, రాంచీ, నాగ్ పూర్, కాజీపేట మీదుగా మళ్లింపు
  • హౌరా సికింద్రాబాద్ రైలును విజయనగరం తిత్లిఘర్ రాంచీ, నాగ్ పూర్ , కాజీపేట మీదుగా మళ్లింపు
  • హౌరా బెంగుళూరు రైలును విజయనగరం, తిత్లిఘర్, రాంచీ, నాగ్ పూర్, బల్లార్షా, విజయవాడ మీదుగా మళ్లింపు
  • సంబల్ పూర్ నాందేడ్ రైలును విజయనగరం వరకు మాత్రమే నడుపుతారు
  • పూరి తిరుపతి మధ్య నడిచే రైలును బాలుగావ్ వరకు నడుపుతారు. 
  • ముంబై భువనేశ్వర్ మధ్య నడిచే రైలులు విశాఖ పట్నం వరకే నడుపుతారు 
  • భువనేశ్వర్ ముంబై మధ్య నడిచే రైలును రద్దు చేశారు