అక్టోబర్ 28 వరకు ఓటర్ అవేర్​నెస్ ప్రోగ్రామ్

అక్టోబర్ 28 వరకు ఓటర్ అవేర్​నెస్ ప్రోగ్రామ్
  • జాగో తెలంగాణ ఫోరం నిర్ణయం

హైదరాబాద్, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఓటర్లకు వివిధ అంశాలపై అవగాహన కల్పించేందుకు జాగో తెలంగాణ ఫోరం ఏర్పాటయ్యింది. రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రకుమార్ చైర్ పర్సన్ గా, రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరు మురళి కన్వీనర్ గా, పలువురు ప్రొఫెసర్లు, మేధావులు, సామాజిక వేత్తలు 13 మంది ఈ ఫోరంలో ఉన్నారు. ఈ నెల 26 నుంచి 28  వరకు రాష్ర్టంలో అన్ని నియోజకవర్గాల్లో బస్సు ద్వారా ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆకునూరు మురళి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ ఈసీ సీఈవోకు లేఖ రాశారు.

ఈ కార్యక్రమంలో భాగంగా 200 మందితో హాల్, కార్నర్, విలేజ్, బస్తీ మీటింగ్ లు నిర్వహిస్తున్నట్లు లేఖలో ఆయన పేర్కొన్నారు. ఈ అవగాహనలో భాగంగా ఓటు విలువ, మంచి అభ్యర్థిని ఎన్నుకోవటం, పార్టీలు ఇస్తున్న హామీలు, మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలపై ఓటర్లకు అవేర్ నెస్ కార్యక్రమాలు నిర్వహిస్తామని మురళి వెల్లడించారు. ఈ సందర్భంగా కళా బృందాలతో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.