
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల తేదీలను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ విజయ్ దేవ్ వివరాలను వెల్లడించారు. షెడ్యూల్‌ను ప్రకటించడంతో మోడల్ ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చిందని వెల్లడించారు. ఢిల్లీలో 250 వార్డులకు సిద్ధమైనట్లు, ఎస్సీలకు 42 సీట్లు రిజర్వ్ చేయబడ్డాయన్నారు.
21 సీట్లు ఎస్సీ మహిళలకు ఉంటాయని, 104 సీట్లు మహిళలకు రిజర్వ్ చేయబడతాయని వెల్లడించారు. నవంబర్ 07న నోటిఫికేషన్ ఉంటుందని.. నవంబర్ 14న ముగుస్తుందన్నారు. నామినేషన్ల ఉప సంహరణకు చివరి తేదీ నవంబర్ 19గా ప్రకటించారు. డిసెంబర్ 04న ఓటింగ్... డిసెంబర్ 07న ఫలితాలను విడుదల చేయడం జరుగుతుందన్నారు.