వాకింగ్‌‌ చేస్తే ఫిట్‌‌నెస్‌‌ పెరుగుతుంది

వాకింగ్‌‌ చేస్తే ఫిట్‌‌నెస్‌‌ పెరుగుతుంది

వాకింగ్‌‌ చేస్తే ఫిట్‌‌నెస్‌‌ పెరుగుతుంది. కాళ్లకు ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. బాడీ బ్యాలెన్స్​ అవుతుంది. నలుగురితో కలిసి కబుర్లు చెప్పుకోవడం వల్ల మానసిక ఆరోగ్యం అని పార్కుల్లో నడుస్తుంటారు చాలామంది. అయితే, వయసు మీద పడటంవల్ల మోకాళ్ల నొప్పులు పెరుగుతాయి. వాటివల్ల ఎక్కువ దూరం నడిస్తే కాళ్లకు ఇంకేదైనా జరుగుతుందని భయపడి ఇంట్లోనే కూర్చుంటారు కొందరు. అలాంటివాళ్లు ఈ జాగ్రత్తలు పాటిస్తూ నడవొచ్చు.

రోజుకు 5వేల అడుగులు నడవాలని టార్గెట్‌‌ పెట్టుకోవాలి. అలా ఓ వారం నడిచాక మోకాళ్లలో ఎలాంటి నొప్పులు రాకుంటే ఇంకా కొన్ని అడుగుల్ని పెంచుకోవాలి.

  • వాకింగ్‌‌ మొదలు పెట్టడంతోనే వేగంగా నడుస్తుంటారు కొందరు. అలా కాకుండా నడక అలవాటు ఉంటేనే వేగంగా నడవాలి. లేదంటే ముందు నెమ్మదిగా నడిచి తర్వాత వేగాన్ని పెంచాలి. నడుస్తుంటే మోకాళ్ల నొప్పులు రావడం కామన్‌‌. అయితే ఆ నొప్పి రెండు రోజులకంటే ఎక్కువ ఉంటే డాక్టర్‌‌‌‌ని కలవాలి‌‌.
  • నడిచేటప్పుడు ఫ్లోరింగ్‌‌ బాగుందా లేదా చూసుకోవాలి. ఎగుడుదిగుడు నేలమీద కాకుండా చదునుగా ఉన్న రోడ్డు మీదే నడవాలి. గుంతల రోడ్డులో వాకింగ్‌‌ చేస్తే మోకాళ్ల జాయింట్స్‌‌లో ప్రాబ్లమ్స్‌‌ వచ్చే అవకాశం ఉంటుంది.
  • హీల్‌‌ ఉన్నవి కాకుండా ఫ్లాట్‌‌గా, మెత్తగా ఉన్నవి,  పాదానికి ఫిక్స్ అయ్యే షూ వాడాలి. బరువుగా ఉండే షూ అస్సలు వాడొద్దు.
  • ఉదయం, సాయంత్రం ఎంత నడిచినా రోజు మొత్తం శరీరంలో కదలిక లేకపోతే వాకింగ్‌‌ చేసి లాభం ఉండదు. 
  • అంటే, ఒకే విధంగా కుర్చీలో కూర్చోవడం, బెడ్‌‌పై పడుకోవడం చేయొద్దు. కాళ్లను అప్పుడప్పుడు కదుపుతుండాలి. ప్రతీ 20 నిమిషాలకు ఒకసారి అటుఇటు నడవాలి.