
దేశీయ ఈ–కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ లో పెట్టిన లక్షల కోట్ల రూపాయల పెట్టుబడిని వెనక్కి తీసుకునే ఆలోచనలో పడింది వాల్‌మార్ట్. రూల్స్ మార్పు వల్ల.. లాభాలు వచ్చే అవకాశాలు లేకపోతే ఫ్లిప్ కార్ట్ నుంచి వాల్‌మార్ట్ బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. చైనాలో అమెజాన్ ఇలాగే చేసిందని అమెరికాకు చెందిన ఆర్థిక సేవల సంస్థ మోర్గన్ స్టాన్లీ తెలిపింది. ‘‘ఫ్లిప్ కార్ట్ నుంచి వాల్‌మార్ట్ వైదొలుగుతుందనే వాదనను పూర్తిగా తీసిపారేయలేం. ఎందుకంటే ఇండియాలో ఈ–కామర్స్ మార్కెట్ సంక్లిష్టంగా తయారయింది’’ అని ఈ సంస్థ ‘అసెసింగ్ ఫ్లిప్ కార్ట్ రిస్క్ టు వాల్‌మార్ట్ ఈపీఎస్ ’ పేరుతో విడుదల చేసిన నివేదిక తెలిపింది.
ఇండియాలో ఈ–కామర్స్, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్ డీఐ) సంబంధించి ఈ నెల ఒకటో తేదీ నుంచి కొత్త రూల్స్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఈ నివేదిక ప్రాధాన్యం సంతరించుకుంది. కొత్త నియమాల ప్రకారం అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి కంపెనీలు సొంత వెండర్ల ద్వారా అమ్మకాలు జరపకూడదు. ఎక్స్‌క్లూజివ్ డీల్స్ కుదుర్చుకోకూడదు. భారీ డిస్కౌంట్ లు ఇవ్వకూడదు. అందరు సెల్లర్లకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలి. చైనాలోనూ ఇలాంటి విధానాలు రావడం వల్లే అమెజాన్ అక్కడి నుంచి 2017లో వెనక్కి వచ్చిందని మోర్గన్ స్టాన్లీ తెలిపింది.
ఇండియా కొత్త ఎఫ్ డీఐ రూల్స్ వచ్చా క ఫ్లిప్ కా ర్ట్ తన ప్రొడక్ట్స్ లో 25 శాతం ఉపసంహరించుకుందని పేర్కొంది. చాలా స్మార్ట్ ఫోన్, ఎలక్ట్రానిక్స్ మోడల్స్ అమ్మకాలను ఆపేయాల్సి రావడం ఫ్లిప్ కార్కుట్ పెద్దదెబ్బని విశ్లేషించింది. ‘‘ఎలక్ట్రానిక్స్ కేటగిరీ నుంచే ఫ్లిప్ కార్ట్ కు 50 శాతం ఆదాయం వస్తుంది. వీటి అమ్మకాలను నిలిపివేయడం సంస్థకు ఇబ్బందిగా మారుతుంది. వాల్‌మా ర్ట్ నుంచి ఒత్తిడి అధికమవుతుం ది’’ అని వివరిం చారు. మొదటి నుంచి స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాల అమ్మకా లు ఈ కంపెనీకి పెద్ద ఎత్తున ఆదాయాలను తెచ్చిపెడుతున్నాయి .
ఇంకా అవకాశాలు ఉన్నాయి…
తాజా పరిస్థితులపై వాల్‌మా ర్ట్ అధికార ప్రతినిధి స్పం దిస్తూ ‘‘ఈ-కామర్స్ కంపెనీల కోసం ఇటీవల చాలా మార్పులు తెచ్చారు. ఇండియా మార్కె ట్ చాలా పెద్దది కాబట్టి మాకు ఇంకా అవకాశాలు ఉన్నాయని ఆశిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఈకామర్స్ విస్తృతి ఇప్పటికీ తక్కువగానే ఉంది. ఇక నుంచి కూడా వ్యవసాయం, ఆహారం, రిటైల్‌లో సుస్థిర ఆర్థికవృద్ధి సాధించడంలో భాగస్వాములం అవుతాం . మా భవిష్యత్ పెట్టుబడులు ఇండియాకు ప్రయోజనం కలిగిస్తాయి ’’ అని ఆయన వివరించారు.
కొత్త రూల్స్ వచ్చాక అత్యధికంగా నష్టపోయింది ఫ్లిప్ కార్ట్ , అమెజానే! అమ్మకాలు ఏకంగా 25–35 శాతం తగ్గాయి. తమ సొంత సెల్లర్‌లను సైట్ల నుంచి తొలగించడమే ఇందుకు ప్రధాన కారణం. అమెజాన్ టాప్ సెల్లర్స్ క్లౌడ్ టేల్, అపారియో రిటైల్ ప్రొడక్ట్స్ ను పూర్తిగా తొలగించారు. ఇవి రెండూ అమెజాన్ తో జాయింట్ వెంచర్ కుదుర్చుకున్నాయి . ‘‘వాల్‌మా ర్ట్ ఫ్లిప్ కార్ట్ ద్వారా ఇండియాలో వ్యూహాత్మక పెట్టుబడులు పెట్టింది. ఇప్పటికిప్పుడు మాత్రం ఇది ఫ్లిప్ కార్ట్ నుంచి బయటికి రాకపోవచ్చు. ఇండియాలో ఈ-కామర్స్ ఇక ముందు ఎలా ఉంటుందనేది ఇప్పుడే చెప్పలేం ’’ అని ఒక విశ్లేషకుడు అన్నారు.